Yadadri: డిజిటల్ సేవల యాదాద్రి!
ABN , Publish Date - Jun 09 , 2024 | 03:58 AM
పుణ్య క్షేత్రానికి పిల్లాపాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం.. బ్రేక్ దర్శనానికో.. శ్రీఘ్రదర్శనానికో.. వత్రాలు, ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకొని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస? బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్ చేసుకోవడమూ కష్టమే! మరి..
అమల్లోకి ఆన్‌లైన్ బుకింగ్ విధానం.. ఆర్జిత సేవలు, పూజా కైంకర్యాలు, గదుల బుకింగ్ ఆన్‌లైన్‌లో
అందుబాటులోకి దేవస్థానం వెబ్ పోర్టల్
యూపీఐ ద్వారా కూడా పార్కింగ్ ఫీజు
ప్రసాద టోకెన్ల బాధ్యత సెంట్రల్ బ్యాంక్‌కు
త్వరలోనే కంప్యూటరైజ్డ్ రసీదులు
సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్న దేవస్థానం
డిజిటల్ విధానంతో పెరిగిన ఆదాయం
మేలో 18.90 కోట్ల రాబడి
యాదాద్రి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పుణ్య క్షేత్రానికి పిల్లాపాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం.. బ్రేక్ దర్శనానికో.. శ్రీఘ్రదర్శనానికో.. వత్రాలు, ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకొని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస? బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్ చేసుకోవడమూ కష్టమే! మరి.. ఈ ఇబ్బందుల్లేకుండా ఎంచక్కా ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలకు సంబంధించిన అన్నింటినీ ఆన్‌లైన్‌లో ముందుగానే బుకింగ్ చేసుకోగలిగితే? అది భక్తులకు ఎంత సౌకర్యవంతమో కదా! ఈ వ్యవ్యస్థే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అమల్లోకొచ్చింది. భక్తుల సౌకర్యార్థం, అలాగే అవకతవకలను నివారించి ఆదాయాన్ని మరింత పెంచే ఉద్దేశంతో స్వామివారి ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో అప్‌గ్రేడ్ చేసేందుకు ఆలయాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ సిస్టం (పీవోఎ్‌స)ను ఏర్పాటు చేశారు. వస్థానం
భక్తుల కోసం దేవస్థానం వెబ్ పోర్టల్ (యాదాద్రి టెంపుల్. తెలంగాణ) ద్వారా ఆర్జితసేవలు, పూజా కైంకర్యాలు, గదులు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. దేవస్థానంలో శాశ్వత పూజల నుంచి ఆర్జితసేవలు, తదితర సేవలన్నీ డిజిటల్‌మయం కానున్నాయి. ఫలితంగా భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలను బుకింగ్ చేసుకొని, ఎలాంటి ఆపసోపాలు పడకుండా హాయిగా దర్శనం చేసుకోవొచ్చు. కొండమీద వాహనాల పార్కింగ్‌కు సంబందించిన పార్కింగ్ ఫీజు రూ.500ను యూపీఐ విధానంలోనూ చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రసాదాల టోకెన్ల బాధ్యత సెంట్రల్ బ్యాంక్ అ్‌ఫ ఇండియాకు అప్పగించారు. ఇటీవల కొండపైన ఉన్న శివాలయం పక్కన కొత్తగా ప్రసాదాల టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ త్వరలోనే ప్రసాదాలను కంప్యూటరైజ్డ్ రసీదుల ద్వారా విక్రయించనున్నారు.
ఆలయానికొచ్చే భక్తులు ఆధ్యాత్మికత, ఆహ్లాద వాతావరణంలో గడిపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం వేళల్లో ఆర్జిత సేవలు తిలకించేందుకు రూ.78 లక్షలతో ఎల్‌ఈడీ, డిజిటల్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంకాలం 5గంటల నుంచి 7గంటల వరకు సంగీత సాహిత్య నృత్య సభల నిర్వహణకు పర్మినెంట్ షెడ్‌ను ఏర్పాటుచేశారు. గతంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్‌లో స్వామివారి దర్శనం చేసుకునేందుకు రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉండేది. అయితే భక్తుల సౌకర్యార్థం డిపాజిట్ లేకుండానే ప్రోటోకాల్ కార్యాలయం నుంచి వీల్‌చైర్లు తీసుకెళ్లే అవకాశం కల్పించారు.
పెరిగిన ఆదాయం
స్వామివారి చెంత సౌకర్యాలు మెరుగుపడటంతో భక్తుల రాక పెరగడం, ఫలితంగా దేవస్థాన ఆదాయమూ పెరిగింది. ఏప్రిల్ నెలలో మొత్తం రూ.15.64 కోట్ల ఆదాయం సమకూరగా, మే నెలలో రూ.18.90 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క ప్రసాదాల విక్రయంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో రూ.1,74,63,580 అధికంగా ఆదాయం వచ్చింంది. గదుల అద్దెల ద్వారా ఆదాయం రూ.24.37 లక్షల నుంచి రూ.43.52 లక్షలకు పెరిగింది. హుండీల రూ.2.33 లక్షల నుంచి రూ.3.92 లక్షలకు, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.43.37 లక్షల నుంచి రూ.47.18 లక్షలకు, శీఘ్ర దర్శనం ద్వారా రూ.95,650 నుంచి రూ.1,84,300 వరకు, వీఐపీ దర్శనం(రూ.150) ద్వారా రూ.95,55,000 నుంచి రూ.2,22,90,000వరకు, బ్రేక్ దర్శనం (రూ.300) ద్వారా రూ.69.10 లక్షల నుంచి రూ.95.76 లక్షలకు, వరకు, ఆర్జిత సేవల ద్వారా రూ.1.13 కోట్ల నుంచి రూ.1.40 కోట్లకు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3.05 కోట్ల నుంచి రూ.4.79 కోట్లకు, కళ్యాణకట్ట ద్వారా 22.28 లక్షల నుంచి రూ.32.31 లక్షలకు ఆదాయం పెగిగింది.
డిజిటల్ సేవలను మెరుగుపరుస్తున్నాం
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం డిజిటల్ సేవలను మెరుగుపరుస్తున్నాం. స్వామివారికి సంబంధించిన అన్నిసేవలనూ ఆన్‌లైన్ చేస్తున్నాం. దేవస్థానం చేత క్యూఆర్‌కోడ్, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రసాదాలకు కంప్యూటరైజ్డ్ రసీదులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. మౌలిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాతల సహకారంతో కొండపై భక్తుల కోసం తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.
- ఎ.భాస్కర్‌రావు, ఈవో యాదగిరిగుట్ట దే