చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..
ABN, Publish Date - Jun 01 , 2024 | 09:03 AM
కడప జిల్లా: వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్‌రెడ్డి చీకటి ఒప్పందానికి తెరలేపారు. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకు ఒక వర్తమానం పంపారు. 25 పోలింగ్ బూత్‌ల్లో పరస్పరం అంగీకారంతో పనిచేద్దామని, ఆ బూత్‌ల్లో అసెంబ్లీ ఓట్లు టీడీపీ వేసుకుంటే.. ఎంపీ ఓట్లు తాము వేసుకుంటామన్నది ఆ సందేశం సారాంశం.
కడప జిల్లా: వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్‌రెడ్డి చీకటి ఒప్పందానికి తెరలేపారు. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకు ఒక వర్తమానం పంపారు. 25 పోలింగ్ బూత్‌ల్లో పరస్పరం అంగీకారంతో పనిచేద్దామని, ఆ బూత్‌ల్లో అసెంబ్లీ ఓట్లు టీడీపీ వేసుకుంటే.. ఎంపీ ఓట్లు తాము వేసుకుంటామన్నది ఆ సందేశం సారాంశం. 25 బూత్‌ల్లో కలిపి సుమారుగా 25-30 వేల ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు తమకు పడితే పులివెందులలో తమకు ఏర్పడే తరుగు కొంతవరకూ పూడుతుందని అవినాశ్ శిబిరం ఆశించింది. అయితే ఈ ప్రతిపాదనకు బీటెక్ రవి శిబిరం అంగీకరించలేదు. గెలిచినా, ఓడినా బహిరంగంగానే పోరాడతామని, ఇటువంటి తెర వెనుక ఒప్పందాలకు అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్
బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 01 , 2024 | 09:03 AM