AP: వైసీపీ నేతల అరాచకం.. మహిళపై దాడి

ABN, Publish Date - Oct 23 , 2024 | 08:35 PM

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల అరాచకాలు ఆగట్లేదు.

అమరావతి: అధికారం కోల్పోయినా వైసీపీ నేతల అరాచకాలు ఆగట్లేదు. తాజాగా కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై వైసీపీ కౌన్సిలర్ దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వారిని వైసీపీ కౌన్సిలర్ అశోక్, అతని అనుచరులుగా గుర్తించారు. బాధితురాలిని ఆదోనీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

Updated at - Oct 23 , 2024 | 08:35 PM