theft case చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:15 AM
పట్టణంలోని హిందూపురం క్రాస్‌లో నివాసముంటున్న బాబా రెడిమెట్ షాపు యజమాని బాబా ఫకృద్దీన ఇంటిలో గతనెల 17న చోరీ జరిగింది. ఈకేసులో నిందితుడు స్థానిక అలంఖానవీధికి చెందిన సాబీర్‌ను అరెస్టు చేసి.. అతని వద్ద నుంచి రూ.9.70 లక్షల నగదు, రెండు తులాల బంగారు హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

కదిరి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని హిందూపురం క్రాస్‌లో నివాసముంటున్న బాబా రెడిమెట్ షాపు యజమాని బాబా ఫకృద్దీన ఇంటిలో గతనెల 17న చోరీ జరిగింది. ఈకేసులో నిందితుడు స్థానిక అలంఖానవీధికి చెందిన సాబీర్‌ను అరెస్టు చేసి.. అతని వద్ద నుంచి రూ.9.70 లక్షల నగదు, రెండు తులాల బంగారు హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషనలో డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపిన వివరాల మేరకు.. సాబీర్ గతంలో ఓ బట్టల షాపులో పనిచేసేవాడు. తరువాత ఆ పని మానివేశాడు. తిరునాళ సమయంలో నిచ్చెనలు వేసి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మిద్దెలపై భక్తులను ఎక్కించేవాడు. ఆలయంలో ఏ ఇంటికి దారి ఉందో పసికట్టిన సాబీర్, బాబాఫకృద్దీన ఇంటిలో ప్రవేశించి ఈ చోరీ చేశాడు. నిందితుడు స్థానిక సున్నపుగుట్టతండాకు వెళ్లే బైపా్‌సరోడ్డులో ఉండగా.. పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ నారాయణరెడ్డి, ఎస్‌ఐ బాబ్‌జాన, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.