Share News

COMPETITIONS: ఉత్సాహంగా బరువులెత్తే పోటీలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:18 AM

శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఆదివారం గ్రామస్థులు, తలారి నాగరాజు ఆధ్వర్యంలో పలు పందేలు నిర్వహించారు. యువకులు, ఉత్సాహవంతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

COMPETITIONS: ఉత్సాహంగా బరువులెత్తే పోటీలు
Palthuru Raju lifting a 151 kg bag of sand

గార్లదిన్నె, ఏప్రిల్‌ 6 ( ఆంధ్రజ్యోతి) : శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఆదివారం గ్రామస్థులు, తలారి నాగరాజు ఆధ్వర్యంలో పలు పందేలు నిర్వహించారు. యువకులు, ఉత్సాహవంతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 151 కేజీల ఇసుక మూట ఎత్తే పందెంలో విడపనకల్లు మం డలం పాల్తూరుకు చెందిన రాజు మొదటి బహుమతి రూ. 3వేలు గెలుపొందగా, కల్లూరు ఆగ్రహారానికి చెందిన సుధాకర్‌ రెండో బహుమతి రూ. 1000 గెలిచాడు. అదేవిధంగా 140 కేజీల రాతిగుండు ఎత్తే పందెం లో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాధాపురానికి చెం దిన ఈశ్వర్‌రెడ్డి మొదటి బహు మతి రూ 3వేలు గెలుచుకోగా, ఆదే గ్రామానికి చెందిన రాజ శేఖర్‌ రెండో బహుమతి రూ. 1000 గెలుచుకున్నాడు. ఒంటి చేత్తో 60 కేజీల రాయి (సంధా) ఎత్తే పందేన్ని ప్యాపిలి మండలం మాధాపురానికి చెందిన పసుపుల హుసేన 25 సార్లు ఎత్తి మొదటి బహుమతి రూ. 3వేలు గెలుచుకోగా, అదేగ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి ఐదు సార్లు ఎత్తి రెండో బహుమతి రూ. 1000 గెలుపొందాడు. ఇరుసు ఎత్తే పందెంలో పామిడి మండలం నాగాలపురానికి చెందిన ఫణేంద్ర మొదటి బహుమతి రూ. 4వేలు గెలుపొందగా, వంకరాజు కాలువకు చెందిన నరేష్‌ రూ. 2వేలు గెలుపొందాడు. కర్రస్వాములో యాడికికి చెందిన రాజేష్‌ మొదటి బహుమతి రూ. 3 వేలు గెలుపొందగా, అదే గ్రా మానికి చెందిన నాగార్జున రెం డో బహుమతి రూ. 2వేలు గెలుపొందాడు. విజేతలకు గ్రా మస్థులు బహుమతులు అంద జేశారు. ఎస్‌ఐ మహ మ్మద్‌ గౌస్‌బాషా ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహిం చారు. గ్రామస్థులు తలారి నాగరాజు, జెన్నె కుళ్లా యప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 07 , 2025 | 12:18 AM