Share News

Minister Lokesh: ఏ సమస్య ఉన్న మా ఇంటి తలుపు తట్టండి ..

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:35 AM

బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్‌ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.

 Minister Lokesh: ఏ సమస్య ఉన్న మా ఇంటి  తలుపు తట్టండి ..
Mana Illu Mana Lokesh Programme

అమరావతి: ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Constituency) మూడో రోజు (3rd Day) ‘మన ఇల్లు... మన లోకేష్’ (Mana Illu Mana Lokesh) కార్యక్రమాన్ని (Programme) ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొలనుకొండ, ఉండవల్లి, ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేస్తున్నారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని అన్నారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామన్నారు. మంగళగిరి చేనేత సోదరులకు హ్యాండ్లూమ్ క్లస్టర్, స్వర్ణకారుల కోసం జేమ్స్ అండ్ జ్యువలరీ పార్క్ వస్తుందని, సులభంగా అయ్యే పట్టాలు ఈ ఏడాది ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Also Read..: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..


రెండోది రైల్వే ఎండోమెంట్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలకు రెండు సంవత్సరాల సమయం పడుతుందని, అటవీ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా కష్ట సాధ్యమని, అయినా మూడు సంవత్సరాల్లోపు ఇస్తామని , మొత్తం 7వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. అందులో 4,000 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారన్నారు. ఈ పట్టాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉందని రెండెళ్ల తర్వాత అమ్ముకునే హక్కు ఎన్డీయే ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మంగళగిరి నియోజవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళతానని, ప్రజలు తనప ఉంచిన బాధ్యతను కచ్చితంగా నెరవేరుస్తాన్నారు. స్వచ్ఛందంగా సేవ చేసేందుకే కుటమి ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని, వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని ఒక రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు ఇస్తున్నామని, మీకు ఏ సమస్య ఉన్న తమ ఇంటి తలుపు తట్టండి .. 24 గంటలు అందుబాటులో ఉంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


కాగా బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ‘మన ఇల్లు- మన లోకేశ్‌’ నినాదంతో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళగిరి డాన్‌ బోస్కో ఉన్నత పాఠశాల వద్ద మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలిరోజు షెడ్యూల్‌లో భాగంగా మొత్తం 546 మందికి నివేశన పట్టాలను లోకేశ్‌ తన స్వహస్తాలతో పంపిణీ చేశారు. వారందరికీ నూతన వస్త్రాలను అందజేసి లబ్ధిదారుల కుటుంబాలతో కలసి ఫొటోలను దిగారు. ప్రారంభ సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... మంగళగిరిలో పోటీచేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం, తదనంతర పరిణామాలు, 2024లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం వంటి విషయాలను భావోద్వేగంతో వివరించారు. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 3,000 మందికిపైగా పట్టాలను పంపిణీ చేస్తున్నా. దేవదాయ శాఖ, రైల్వే భూముల విషయంలో కొంత సమయం పట్టే అవకాశం వుంది. వాగు భూములు, అటవీ భూముల్లో నివశిస్తున్న వారికి పట్టాలను ఇప్పించడం చాలా కష్టమైన పని. అయినా నేను చేసి తీరుతా. అందుకు మూడేళ్లు పట్టవచ్చు. మొదటి విడత ఇస్తున్న పట్టాల విలువను బహిరంగ మార్కెట్‌తో పోల్చి చూస్తే రూ.1,000 కోట్ల వరకు వుంటుందని లోకేష్ చెప్పారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజి, గ్యాస్‌, పైప్‌ లైన్లు... చివరకు భూగర్భ విద్యుత్‌ లైన్ల పనులు కూడా మంగళగిరిలో వచ్చే రెండు నెలల్లో ప్రారంభిస్తామని లోకేష్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు బంద్

తగ్గుతున్న బంగారం ధరలు..

విశాఖ గిరిజన గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

For More AP News and Telugu News

Updated Date - Apr 07 , 2025 | 11:35 AM