ELECTRIC : నిండా నిర్లక్ష్యం..!
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:18 AM
విద్యుత శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. మండల పరిధిలోని మన్నిల పంచాయతీలో నెలకొన్న విద్యుత పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నా యి. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చేతికందేంత ఎత్తులో ట్రాన్స ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీనికితోడు ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసిన చోట విద్యుత స్తంభం దెబ్బతిని ఒక వైపు వాలిపోయింది.

నిండా నిర్లక్ష్యం..!
పలు చోట్ల ప్రమాదకర స్థితిలో స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు
పట్టించుకోని విద్యుత అధికారులు
అనంతపురం రూరల్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): విద్యుత శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. మండల పరిధిలోని మన్నిల పంచాయతీలో నెలకొన్న విద్యుత పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నా యి. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చేతికందేంత ఎత్తులో ట్రాన్స ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీనికితోడు ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసిన చోట విద్యుత స్తంభం దెబ్బతిని ఒక వైపు వాలిపోయింది. విద్యుత లైన్లను ఇళ్ల మీదుగా లాగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకుకొస్తుందన్న భయం స్థానికుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఎస్సీ కాలనీలోనే త్రీఫేస్ లైన స్తంభం కూడా ఇదే పరిస్థితి లో ఉంది. స్తంభం దెబ్బతిని, విరిగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు విరిగి జనం మీద పడుతుందోన్న భయం స్థానికులకు పట్టుకుంది. అదే విధంగా గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక భాగంలోని ట్రాన్సఫార్మర్ ఓవర్ లోడు కారణంగా చెడిపోయి ఏడాది అవుతోంది. స్థాని కంగా మరో ట్రాన్సఫార్మర్‌ను ఏర్పాటు చేశారుగానీ, పాతదానిని తొలగించలే దు. ప్రస్తుతం పనిచేస్తున్న ట్రాన్సఫార్మర్‌కు లోడ్ ఎక్కువై తరచూ విద్యుత పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు ఆ ట్రాన్సఫార్మర్ చుట్టూ ముళ్లకంప లు పెరిగిపోయాయి. చెట్లు, తీగలు దానికి అల్లుకుపోయాయి. సంబంధిత ఉద్యోగులు వాటిని పట్టించుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో నెల కొన్న విద్యుత పరమైన సమస్యలపై కొన్ని నెలలుగా విద్యుత అధికారులకు తెలియ జేస్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....