Honoring students విద్యార్థులకు సన్మానం
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:22 AM
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులను స్థాని బీజేపీ కార్యాలయంలో సోమవారం సన్మానించారు

ధర్మవరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులను స్థాని బీజేపీ కార్యాలయంలో సోమవారం సన్మానించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోనలో ఆ విద్యార్థులను అభినందించి.. పలు సలహాలు.. సూచనలు ఇచ్చారు. భవిష్యతలో కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇనచార్జ్ హరీశ పాల్గొన్నారు.