ROADS : బాగుపడిన గ్రామీణ రోడ్లు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:51 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో గ్రామాల రోడ్లు రూపురేఖలు మా రుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, గుంతల రోడ్ల స్థానం లో తారురోడ్లు నిర్మిస్తుండడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. మండలంలోని మరూరు నుంచి చాపట్లకు, మరూరు నుంచి ఎం. చెర్లోపల్లి మీదుగా పాలబావికి తారురోడ్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభు త్వంలో 2018లో అప్పటి మంత్రి పరిటాల సునీత నిధులు మంజూరు చేయించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా రు.

ప్రజలు, వాహనదారుల్లో హర్షం
రాప్తాడు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో గ్రామాల రోడ్లు రూపురేఖలు మా రుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, గుంతల రోడ్ల స్థానం లో తారురోడ్లు నిర్మిస్తుండడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. మండలంలోని మరూరు నుంచి చాపట్లకు, మరూరు నుంచి ఎం. చెర్లోపల్లి మీదుగా పాలబావికి తారురోడ్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభు త్వంలో 2018లో అప్పటి మంత్రి పరిటాల సునీత నిధులు మంజూరు చేయించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా రు. 2019లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయా గ్రామాల తారురోడ్ల పనులు నిలిచి పోయాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధి తారురోడ్డు నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ప్రజలు పలు మార్లు వి న్నవించినా రోడ్లు వేయిం చలేదు. దీంతో ప్రజలు ఐదేళ్లూ గుంతల దారిలో రాకపోకలు సాగిం చేం దుకు ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. గుం తల రోడ్లలో వా హన దారులు ప్రమాదాలకు కూడా గురయ్యారు.
కూటమి ప్రభుత్వంతో మహర్దశ
2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే చాపట్ల, ఎం. చెర్లోపల్లి, పాలబావి రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో ఆయా గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే పరిటాల సునీత తారురోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. మరూరు నుంచి చాపట్లకు 3 కి.మీ తారురోడ్డు నిర్మాణానికి రూ.1.59 కోట్లు మంజూ రు చేయించగా పనులు పూర్తి చేశారు. మరూరు నుంచి ఎం. చెర్లోపల్లి, పాలబావి, మారెమ్మ ఆలయం వరకూ 9 కి.మీ తారురోడ్డ్డు నిర్మాణానికి రూ. 4.96 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఇప్పటికే మరూరు నుంచి చెర్లోపల్లికి తారురోడ్డు నిర్మించారు. ఇక చెర్లోపల్లి నుంచి పాలబావి కి రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏన్నో ఏళ్ల తర్వాత తమ గ్రామాలకు తారురోడ్డు నిర్మించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....