LAY OUT : పట్టాలకే పరిమితం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:24 AM
పేదవాడి సొంతింటి కలను ని జం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా కాలనీలనే ఏర్పాటు కు పూనుకుంది. అయితే మండలంలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు చే య లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం మంజూరు చేయడం, అనువుగానిచోట స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి అసక్తి చూపలేదు.

ఒక్క ఇల్లు మంజూరు కాని వైనం
కంపచెట్లతో నిండిన జగనన్న కాలనీలు
కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారుల ఆశలు
శింగనమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి) : పేదవాడి సొంతింటి కలను ని జం చేస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా కాలనీలనే ఏర్పాటు కు పూనుకుంది. అయితే మండలంలో ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరు చే య లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు స్థలం మాత్రం మంజూరు చేయడం, అనువుగానిచోట స్థలాలు ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి అసక్తి చూపలేదు. దీంతో మండలంలోని పేదల సొం తంటి కల అలాగే మిగిలిపోయింది. శింగనమల మండలంలోని 14 పం చాయతీల్లో గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు జగనన్న ఇంటి పట్టాల ను 380 మందికి పంపిణీ చేశారు. శింగనమలలోని 110 మందికి, కల్లు మడి, తరిమెల పంచాయతీలకు కలిపి 100పైగా ఆయా జగనన్న లేఔట్ల లో ఇంటి పట్టాలు ఇచ్చారు. అయితే మండలపరిధిలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశపడ్డారు. తీరా ఎన్నికలు సమీపించే సరికి గత వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై లబ్ధిదారులకు ఇ ళ్ల స్థలాల రిజిసే్ట్రషన కూడా చేశారు. కానీ ఆ స్థలాల్లో ఎక్కడ చూసినా కంపచెట్లు పెరగడంతో జగనన్న కాలనీలు ఆడవులను తలపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంపై ఆశలు
గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా 380 పట్టాలు ఇచ్చినా, ఎక్కడా పునాది రాయి కూడా పడలేదు. దీంతో లబ్ధిదారులు ఇప్పడు కూ టమి ప్రభుత్వం అయినా ఇళ్లు మంజూరు చేస్తుందనే ఆశతో ఉన్నారు.
అర్హుల జాబితా పంపుతాం- నామాల శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ
మండలంలో అర్హత కలిగిన లబ్ధిదారులను నుంచి పట్టా, ఇతర డాక్యుమెంట్లు తీసుకుంటు న్నాం. ఇళ్ల మంజూరుకు అర్హులైన వారి జాబి తా తయారు చేస్తున్నాం. ఇళ్ల మంజూరు కోసం త్వరలో ప్రభుత్వానికి జాబితా పంపుతాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....