Share News

MLA SUNITHA: రుణాలు చెల్లించండి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:19 AM

నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

MLA SUNITHA: రుణాలు చెల్లించండి
Speaking MLA Paritala Sunitha

రామగిరి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు గడువులోగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల స్వయం సహాయక సంఘాల సభ్యులు అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కొన్నిచోట్ల రుణాలు చెల్లించక ఎమ్మెల్యే చెప్పారని అందుకే చెల్లించలేదని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని ఆమె తెలిపారు. మూడుమండలాల్లో 3,300 స్వయం సహాయకసంఘాలుండగా ఇందులో ఏ గ్రేడ్‌ 1871, బీ గ్రేడ్‌ 945, సీ గ్రేడ్‌ 182 ఉన్నాయన్నారు. రుణాలు చెల్లించ ని గ్రూపులు సీ గ్రేడ్‌లోకి వెళ్లాయన్నారు. దీనివల్ల వారు నష్టపోతారని భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశం లేదన్నారు. క్రమం తప్పకుండా చెల్లింపులుచేసి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నారు. ఏరియాకో ఆర్డీనేటర్‌ సత్యనారాయణ, నాయకులు రామ్మూర్తినాయుడు, పరంధామయాదవ్‌, సుధాకర్‌, ఏపీఎంలు వెంకటప్ప, నాగేంద్ర పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈడిగ వెంకటేశగౌడ్‌ గుండెపోటుతో మృతిచెందడంతో ఎమ్మెల్యే నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Updated Date - Jan 04 , 2025 | 12:19 AM