MLA: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:26 AM
ప్రతి పాఠశాలలో తప్పని సరిగా మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె మంగళ వారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.

విద్యా శాఖాధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన
అనంతపురం అర్బన, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రతి పాఠశాలలో తప్పని సరిగా మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖాధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె మంగళ వారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. నియోజకవర్గంలోని పాఠశాలలు, జూ నియర్ కళాశాల్లో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. వి ద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.... విద్యార్థులకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో మౌలిక వసతులైన తాగునీరు, మరుగు దొడ్లు, తరగతి గదులు ఉండేలా చూడాలన్నారు. పరిశుభ్రతపై విద్యార్థు లకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించాలన్నారు. విద్యా శాఖ మంత్రి నారాలోకేశ సూచనల మేరకు పాఠశాలలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. మండల విద్యా శాఖాధికారు కార్యాలయాల మరమ్మతు ల కోసం అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. కనగానపల్లి కేజీబీవీలో విద్యుత ట్రాన్సఫార్మర్ సమస్య పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేప థ్యంలో ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....