Share News

ROAD : శరవేగంగా రోడ్డు పనులు

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:44 AM

మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ROAD : శరవేగంగా రోడ్డు పనులు
Talpur Asphalt road work is progressing rapidly

ఆత్మకూరు డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు తారురోడ్డు పనులుశరవేగంగా జరుగుతుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలకు పైగా నిధులతో రో డ్డు నిర్మాణం చేపట్టారు. ఇక 15రోజుల్లో రోడ్డు ప్రాంభానికి సిద్దమవుతున్నట్లు టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, పార్లమెంటు అదికార ప్రతినిధి శశాంక చౌదరి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మం డలంలో ఎక్కడా రోడ్డు వేయలేదన్నారు. మండలంలో దశలవారీగా ప్రతి గ్రామానికి తారురోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 05 , 2025 | 12:44 AM