ROAD : రహదారిపై వృథా నీటి ప్రవాహం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:22 AM
మండలంలోని మరూరు సబ్ స్టేషన సమీపంలోని అంగనవాడీ కేంద్రం వద్ద నుంచి వాల్మీకి విగ్రహం వరకు ఇళ్లలోని వ్యర్థపు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. బీసీ కాలనీలో మురగు నీరు ప్రవహించే కాలువలు లేక పోవడంతో ఇళ్ల లోని వ్యర్థపు నీరు, కొళాయిల నుంచి వృథా అయ్యే నీరు రోడ్డుపైనే నిరం తరం ప్రవ హిస్తోంది.

రాప్తాడు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని మరూరు సబ్ స్టేషన సమీపంలోని అంగనవాడీ కేంద్రం వద్ద నుంచి వాల్మీకి విగ్రహం వరకు ఇళ్లలోని వ్యర్థపు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. బీసీ కాలనీలో మురగు నీరు ప్రవహించే కాలువలు లేక పోవడంతో ఇళ్ల లోని వ్యర్థపు నీరు, కొళాయిల నుంచి వృథా అయ్యే నీరు రోడ్డుపైనే నిరం తరం ప్రవ హిస్తోంది. వ్యర్థపు నీరు ప్రవహించడంతో రోడ్డు అధ్వానంగా తయా రవు తోంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని చిన్నకదర య్యస్వామి ఆలయానికి ప్రతి శనివా రం అనేక మంది భక్తులు వివిద గ్రా మాల నుంచి వస్తుంటారు. రోడ్డుపై వ్యర్థపు నీరు యథేచ్ఛగా ప్రవహిస్తుం డటంతో వాహనదారులు, ప్రజలు అసహ నం వ్యక్తం చేస్తున్నారు. అధి కారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మురు గు కాలువలు ఏర్పాటు చేసి వ్యర్థపు నీరు రోడ్డుపై ప్రవహించ కుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....