Share News

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:01 AM

నాడు-నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అరకొర పనులు చేపట్టి ప్రచారహోరు సాగించింది. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని ప్రకటన లిచ్చారు. ప్రతి పేద సొంతింటి కల నెరవేరు స్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో ముందడుగు వేసి ప్రతి లబ్ధిదారుడికి తానే స్వయంగా ఇల్లు కట్టించి, తాళాలు చేతికిస్తానని చెప్పి... అసంపూర్తిగా ఇళ్లను నిర్మించా రు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరక అప్పులపాలయ్యారు.

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు
Unfinished Jagananna Colony at Kanaganapally

అప్పుల పాలైనాం : లబ్ధిదారులు

కనగానపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నాడు-నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అరకొర పనులు చేపట్టి ప్రచారహోరు సాగించింది. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని ప్రకటన లిచ్చారు. ప్రతి పేద సొంతింటి కల నెరవేరు స్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో ముందడుగు వేసి ప్రతి లబ్ధిదారుడికి తానే స్వయంగా ఇల్లు కట్టించి, తాళాలు చేతికిస్తానని చెప్పి... అసంపూర్తిగా ఇళ్లను నిర్మించా రు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరక అప్పులపాలయ్యారు. జగనన్న కాలనీలు మెండిగోడలతో దర్శనమిస్తున్నాయని, గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన మోడల్‌ కాలనీ నేటీకీ ఆదర్శంగా ఉందని జనం అంటున్నారు.


గత టీడీపీ హయాంలో...

ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో జాతీయ రహదారి పక్కన ఉంది ముక్తాపురం. గత టీడీపీ హయాంలో గ్రామంలోని రైతులు, కూలీల విన్నపం మేరకు అప్పుడు మంత్రిగా ఉన్న ప్రస్థుత ఎమ్మె ల్యే పరిటాల సునీత గ్రామానికి 134 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వాటిని లాటరీ పద్ధతిలో అందజేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ1.50 లక్షలు మంజూరు చేసింది. అన్ని వసతులతో కూడిన ఇల్లు కట్టుకోవడాని ఆ మెత్తం సరిపోకపో వడంతో బ్యాంకుల ద్వారా రూ25 వేలు రుణాన్ని ఇప్పించి నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేశారు. ఆదర్శంగా కాలనీలు నిర్మాణానికి శ్రమించిన అప్పటి హౌసింగ్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం స్కాచ అవార్డులతో సత్కరించింది. ముక్తాపురంలో మోడల్‌ కాలనీని ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఇళ్లను చూసి ఒక రోజు బస చేయాలని ఉందని లబ్ధిదారులతో అన్నట్లు గ్రామస్థులు తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే మోడల్‌కాలనీలో అన్ని వసతు లు కల్పించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్కులు అధ్వానంగా తయారయ్యాయి.


మొండిగోడలతో జగనన్న కాలనీలు

గత వైసీసీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలు పూర్తి స్థాయిలో నిర్మించక అధ్వానంగా తయారయ్యాయి. మండలం లోని కనగానపల్లి, వేపకుంట, తూంచెర్ల, బద్దలా పురం గ్రామాల్లో 162 ఇళ్లను మంజూరు చేశారు. 42 పూర్తికాగా మిగిలినవి పునాది, మెండి గోడలతో దర్శనమిస్తున్నాయి. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి చెందిన రాంక్రీట్‌ సంస్థ అసంపూ ర్తిగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులను నిండా ముం చేసిందని పలువురు అంటున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి ఇళ్దను నిర్మించుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2025 | 12:01 AM