Kodandarama Swamy: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:19 AM
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. వేదపండితుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు

ఒంటిమిట్ట, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరిగింది. సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేదపండితులు విష్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, కనకధారణ చేశారు. అనంతరం ఆగమ పండితులు రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పుట్టమన్ను సేకరించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటే్‌షబాబు, భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News