Share News

Microbiology Department: గుంటూరులో బర్డ్‌ఫ్లూ రీజనల్‌ సర్వేలెన్స్‌ సెంటర్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:49 AM

గుంటూరులో బర్డ్‌ఫ్లూ రీజనల్‌ సర్వెలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిందని, ఇది వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో పని చేస్తుందని తెలియజేశారు. ఈ కేంద్రం ఐసీఎంఆర్‌ వైద్య బృందం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది

 Microbiology Department: గుంటూరులో బర్డ్‌ఫ్లూ రీజనల్‌ సర్వేలెన్స్‌ సెంటర్‌

  • వైద్య కళాశాల వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో ఏర్పాటు

  • ల్యాబ్‌ను సందర్శించిన కేంద్ర బృందం

  • శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చ

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): గుంటూరులో బర్డ్‌ఫ్లూ రీజనల్‌ సర్వెలెన్స్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో పనిచేసే స్టేట్‌ లెవెల్‌ వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబోరేటరీ (వీఆర్‌డీఎల్‌)కి అనుబంధంగా ఈ సెంటర్‌ పని చేస్తుంది. ఈ ల్యాబ్‌కు అవసరమైన డయాగ్నోస్టిక్‌ కిట్లను, కన్స్యూమబుల్స్‌ను పుణేలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌ (ఎన్‌ఐఎల్‌) సరఫరా చేస్తుంది. ఈ రాష్ట్ర స్ధాయి వైరస్‌ పరిశోధన, పరీక్షా కేంద్రానికి స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ ఏ, బీ తదిత ర వ్యాధులతో పాటు ఇన్‌ఫ్లూయోంజా ఏలో రెండు సబ్‌ టైప్‌లను నిర్ధారించే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైర్‌సతో మృతి చెందిన సంఘటన నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వెలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎ్‌సపీ) స్టేట్‌ అధికారులు శనివారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చారు. మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో పని చేస్తున్న రాష్ట్రస్థాయి వైరస్‌ పరిశోధన, పరీక్షా కేంద్రాన్ని (వీఆర్‌డీఎల్‌) సందర్శించారు.


వీఆర్‌డీఎల్‌కు చెందిన సైంటిస్టులు లోకేశ్‌, మైమూనా, డాక్టర్‌ వాణీశ్రీ తదితరులతో ఈ కేంద్ర బృందం సుమారు గంటన్నరపాటు సమావేశమై వివిధ అంశాలను చర్చించింది. ల్యాబ్‌ పని తీరుపై ఐసీఎంఆర్‌ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది వ్యవధిలో వీఆర్‌డీఎల్‌లో జరిపిన వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గడిచిన మూడు నెలల్లో 50 అనుమానిత ఇన్‌ఫ్లూయోంజా ఏ వైరస్‌ కేసులకు నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు డాక్టర్‌ లోకేశ్‌ తెలిపారు. ఇకపై అనుమానిత కేసుల నమూనాలను ఐసీఎంఆర్‌, ఫుణేలోని నేషనల్‌ ల్యాబ్‌కు పంపాలని కేంద్ర బృందం సూచించింది.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:51 AM