CM Chandrababu Naidu: పవన్‌కల్యాణ్, బాలకృష్ణ బాగానే ఉన్నారు
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:14 AM
ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థులతో చంద్రబాబు తెలుగులో మాట్లాడి, జనాభా నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌లో 40% ఉన్నారని, స్టార్టప్‌ల విజయశాతం 80% అని తెలిపారు.

విద్యార్థులతో బాబు సరదా సంభాషణ
పరిశోధక విద్యార్థుల కోరిక మేరకు చంద్రబాబు చివరిలో తెలుగులో ప్రసంగించారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా జన్మభూమిని, కర్మభూమిని మరువకూడదని సూచించారు. వెంటనే విద్యార్థులు ‘తెలుగుదేశాన్ని మరువం సార్’ అని అనగా, చంద్రబాబు పెద్దగా నవ్వారు. ‘‘తెలుగుదేశాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మంచి రాజకీయ పార్టీ బలంగా ఉంటేనే ప్రజలకు మంచి పథకాలు అమలు చేయగలుగుతాం’ అని వ్యాఖ్యానించారు. 25 యేళ్లకు ముందు జనాభా నియంత్రణ ఉండేదని, ప్రస్తుతం జనాభా నిర్వహణ తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగానే అమలు చేశాయని, ప్రస్తుతం జనాభా నిర్వహణపై అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఉత్తరాది రాష్ట్రాలు జనాభాలో ఉన్నతస్థితికి చేరుకుని ఉత్తరాదివారంతా దక్షిణాది రాష్ట్రాలకు వలసగా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. చంద్రబాబు తెలుగు ప్రసంగాన్ని ముగించేందుకు సిద్ధమవుతుండగా ‘వాట్ ఎబౌట్ పవన్, బాలయ్య సార్’ అంటూ కొంతమంది విద్యార్థులు కేకలేశారు. ఇందుకు చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ.. ‘పవన్ కల్యాణ్, బాలకృష్ణ బాగానే ఉన్నారు’ అంటూ సమాధానమిచ్చారు. ఆ తర్వాత ‘అందరికీ వణక్కం’ అంటూ చంద్రబాబు ప్రసంగం ముగించారు.
ఐఐటీఎంలో తెలుగు హవా..
ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘వివిధ రకాల ఆన్‌లైన్ కోర్సులు ఐఐటీఎం అందిస్తోంది. కొత్త ఆవిష్కరణలు, అగ్నికుల్ కోస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్ట్‌పలలో ఈ సంస్థ చేపట్టిన నూతన పరిశోధనలు దేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్ట్‌పలు దాదాపు 80 శాతం విజయం పొందాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం దాకా ఉన్నారు’’ అని సీఎం పేర్కొన్నారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..