Share News

మళ్లీ.. స్వర్ణమ్మను చెరబట్టారు

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:05 AM

‘ఓం నమశ్శివాయ’ అంటూ శివనాస్మరణ వినబడుతూ ఉంటుంది. ముక్కంటి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది. అలాంటి చోట.. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపాన ఆదివారం రాత్రి ఓ ఎక్స్‌కవేటర్‌ దడదడమంటూ శబ్ధం చేస్తూ ఇసుక తవ్వుతోంది. ట్రాక్టర్లకు నింపుతోంది. ఆ ఇసుక ట్రాక్టరు ఆలయం నుంచి పొన్నాలమ్మ గుడివైపు వెళ్లే వంతెనపై వాయువేగంతో వెళుతూ భక్తులను భయాందోళనకు గురిచేసింది. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. 20 ఏళ్ల నుంచి పట్టణ పరిధిలో ఇసుక తవ్వకాలు జరగలేదు. రెండు నెలల కిందట కొందరు ఏకంగా ముక్కంటి ఆలయానికి ఎదురుగా ఉన్న స్వర్ణముఖి నదిలో పట్టపగలు, విచ్చలవిడిగా ఇసుక తవ్వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 26వ తేదీన ‘శివయ్యా.. స్వర్ణమ్మను చెరబడుతున్నారు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దాంతో ఇక్కడ తవ్వకాలకు అడ్డుకట్ట పడింది.

మళ్లీ.. స్వర్ణమ్మను చెరబట్టారు
స్వర్ణమ్మను చెరబడుతున్నారంటూ జనవరి 26న ప్రచురితమైన కథనం

శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

‘ఓం నమశ్శివాయ’ అంటూ శివనాస్మరణ వినబడుతూ ఉంటుంది. ముక్కంటి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది. అలాంటి చోట.. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపాన ఆదివారం రాత్రి ఓ ఎక్స్‌కవేటర్‌ దడదడమంటూ శబ్ధం చేస్తూ ఇసుక తవ్వుతోంది. ట్రాక్టర్లకు నింపుతోంది. ఆ ఇసుక ట్రాక్టరు ఆలయం నుంచి పొన్నాలమ్మ గుడివైపు వెళ్లే వంతెనపై వాయువేగంతో వెళుతూ భక్తులను భయాందోళనకు గురిచేసింది. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. 20 ఏళ్ల నుంచి పట్టణ పరిధిలో ఇసుక తవ్వకాలు జరగలేదు. రెండు నెలల కిందట కొందరు ఏకంగా ముక్కంటి ఆలయానికి ఎదురుగా ఉన్న స్వర్ణముఖి నదిలో పట్టపగలు, విచ్చలవిడిగా ఇసుక తవ్వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 26వ తేదీన ‘శివయ్యా.. స్వర్ణమ్మను చెరబడుతున్నారు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దాంతో ఇక్కడ తవ్వకాలకు అడ్డుకట్ట పడింది. మళ్లీ శ్రీకాళహస్తిలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. గత నెలలో మహాశివరాత్రి సందర్భంగా పార్కింగ్‌ ప్రాంతం కేటాయింపు కోసం స్వర్ణముఖి నదిలో రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడా రోడ్డు ద్వారా ఆదివారం రాత్రి అక్రమార్కులు నదిలో ఇసుక తవ్వకాలను ప్రారంభించారు. యంత్రాలతో ఇసుక తవ్వేందుకు శ్రీకారం చుట్టారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు స్వర్ణముఖి నది నుంచి ఇసుకతో ముక్కంటి ఆలయం ముందు నుంచే అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్లు వెళుతున్న వేగాన్ని చూసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇలా.. పట్టణ నడిబొడ్డున ఏకంగా యంత్రాలతో తవ్వుతూ మళ్లీ.. స్వర్ణమ్మను చెరబట్టారు. మరీ ఇంత దాష్టీకమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

చెలరేగిన గ్రావెల్‌ మాఫియా

తొట్టంబేడు మండలం శివనాథపాళెం వద్ద గ్రావెల్‌ మాఫియా మళ్లీ చెలరేగిపోయింది. ఒకటిన్నర నెలపాటు స్తబ్ధుగా ఉన్న అక్రమార్కులు.. మళ్లీ ఆదివారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. తెలుగు గంగ కాలువ పక్కన ఉన్న చెరువులో నుంచి ఏకంగా అక్రమంగా రోడ్డును నిర్మించేశారు. రాత్రి వేళల్లో యంత్రాలతో గ్రావెల్‌ తవ్వి.. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారు. దీనిపై ఫిబ్రవరి 8వ తేదీన ‘శ్రీకాళహస్తిలో మట్టి దొంగలు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీంతో కొన్నాళ్లపాటు గ్రావెల్‌ అక్రమ రవాణాను ఆపారు. మళ్లీ ఆదివారం రాత్రి రెండు ఎక్స్‌కవేటర్లు, పది టిప్పర్లు, 20 ట్రాక్టర్లతో గ్రావెల్‌ తవ్వకానికి దిగారు.

Updated Date - Mar 24 , 2025 | 02:05 AM