Share News

Betting APPs Network: బెట్టింగ్ యాప్‌లు ఎలా పనిచేస్తాయో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే

ABN , Publish Date - Mar 26 , 2025 | 06:48 PM

ప్రస్తుత కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. కానీ బెట్టింగ్ యాప్‌లలో అనేక మ్యచుల స్కోర్ వెంట వెంటనే ఎలా వేగంగా అప్‌డేట్ అవుతుంది. దీంట్లో ఏదైనా స్కాం ఉందా, లేదంటే నిజమేనా వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Betting APPs Network: బెట్టింగ్ యాప్‌లు ఎలా పనిచేస్తాయో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే
How to work Betting Apps

ప్రస్తుతం మనం చూస్తున్న క్రికెట్ మ్యాచ్‌లలో, బాల్ పడగానే అనేక బెట్టింగ్ యాప్‌లలో స్కోర్లు వెంట వెంటనే అప్‌డేట్ అవుతుంటాయి. అదే సమయంలో రేట్లు కూడా క్షణాల్లో మారడం చూస్తుంటాం. కానీ ఈ మొత్తం వ్యవస్థ గురించి అనేక మందికి ఎలా జరుగుతుందనేది తెలియదు. పలువురు దీనిని స్కాం అని కొట్టిపడేయగా, మరికొంత మంది మాత్రం సాధ్యమేనని చెబుతుండటం విశేషం. అయితే బెట్టింగ్ యాప్స్‌లలో స్కోర్ ఎలా అప్‌డేట్ అవుతుదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


స్కోరు అప్‌డేట్ ఎలా జరుగుతుంది?

బెట్టింగ్ యాప్‌లు రియల్ టైమ్ డేటా ఫీడ్‌లను ఉపయోగిస్తాయి. అంటే, మ్యాచ్ సమయంలో ప్రతి బాల్, వికెట్, రన్ అయినా కూడా ఏ విధంగా జరిగితే ఆ సమాచారాన్ని వెంటనే అందుకుంటాయి. దీని సాధించేందుకు రెండు అంశాలు కీలకంగా ఉంటాయి.

ఆధికారిక స్కోరింగ్ సంస్థలు: ICC లేదా BCCI వంటి సంస్థలు మ్యాచ్‌ను ట్రాక్ చేస్తాయి. ఇవి మ్యాచ్ సమయంలో డేటాను ప్రాసెస్ చేసి, అధికారిక రికార్డులను అందిస్తాయి.

థర్డ్-పార్టీ డేటా ప్రొవైడర్లు: Sportradar లేదా Bet365 వంటి సంస్థలు కూడా ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రతి బాల్, రన్ లేదా వికెట్ గురించి డేటా సేకరిస్తాయి.

  • ఈ డేటాను స్కోరర్లు డిజిటల్ సిస్టమ్‌లో నమోదు చేస్తారు. తర్వాత, ఈ సమాచారాన్ని శాటిలైట్ లేదా హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా సర్వర్లకు పంపిస్తారు. సర్వర్‌ల నుంచి ఈ డేటా 5G టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా బెట్టింగ్ యాప్‌లకు చేరుతుంది. అయితే ఇదంతా కూడా మిల్లీ సెకన్లలో జరిగి యాప్‌లలో అప్‌డేట్ అవుతుండటం విశేషం.


మరి రేట్లు ఎలా క్షణాల్లో మారుతాయి

ప్రతి మ్యాచ్‌లో మార్కెట్ రేట్లు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు, ఒక స్టార్ బ్యాట్స్‌మన్ ఔట్ అయితే, ఆ రేట్లు తక్షణమే మారిపోతాయి. ఇది ఎలా జరుగుతుందంటే, బెట్టింగ్ యాప్‌లు అందుకోసం ఆటోమేటెడ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. ఈ అల్గారిథమ్‌లు ప్రతి బాల్, వికెట్, రన్‌లను విశ్లేషిస్తాయి. ఆటగాళ్ల పనితీరు, గత గణాంకాలు, వాతావరణం, పిచ్ కండిషన్స్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి.

బెట్టింగ్ యూజర్ల పనితీరు (ఉదాహరణకు, యూజర్ ఎటువంటి బెట్టింగ్ లైన్స్ సెలెక్ట్ చేస్తున్నాడో) ఆధారంగా కూడా రేట్లు సర్దుబాటు చేస్తాయి. మరోవైపు AI, మెషిన్ లెర్నింగ్ (Machine Learning) ఆధారంగా ఈ అల్గారిథమ్‌లు యూజర్‌లు చేస్తున్న బెట్టింగ్ ప్యాటర్న్‌లను కూడా అనలైజ్ చేస్తాయి. సరఫరా డిమాండ్ ఆధారంగా రేట్లు సర్దుబాటు చేయడం కూడా ఈ ప్రాసెస్‌లో భాగమేనని అంటున్నారు నిపుణులు.


గ్రౌండ్‌లో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఉంటారా

బెట్టింగ్ యాప్‌లు సాధారణంగా విదేశాల నుంచి నిర్వహిస్తారు. వాటిలో చైనా, మాల్టా వంటి తదితర ప్రాంతాల్లో ఉండగా, అక్కడ చట్టాలు వీటికి అనుకూలంగా ఉంటాయి. అంటే, బెట్టింగ్ యాప్ నిర్వాహకులు గేమ్ గ్రౌండ్‌లో ఉండరని చెప్పవచ్చు. అయితే, గ్రౌండ్‌లో స్కోరర్లు, మ్యాచ్ అధికారులు మాత్రం ఉంటారు. వారు ఆధికారిక డేటా కోసమే పనిచేస్తారు. వారు బెట్టింగ్ సమాచారంతో సంబంధం లేకుండా, కేవలం స్కోరింగ్ డేటాను ప్రాసెస్ చేస్తారు. అయితే కొన్ని అక్రమ బెట్టింగ్ మాఫియాలు స్థానిక ఏజెంట్లను ఉపయోగించి ఈ సమాచారాన్ని సేకరించడాన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. 2025లో తెలంగాణ పోలీసులు ఈ విషయంపై హెచ్చరికలు కూడా జారీ చేశారు.


మిల్లీ సెకన్లలో సమాచారం ఎలా అందుతుంది?

సమాచారాన్ని మిల్లీ సెకన్లలో యాప్‌లకు ఎలా పంపుతున్నారు. ఈ వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిషన్ కోసం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, 5G నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తారు. క్రికెట్ మ్యాచ్‌లో ప్రతి బాల్ పడినప్పటికీ, ఆ సమాచారాన్ని 50 మిల్లీ సెకన్లలోపు యాప్‌లో అప్‌డేట్ చేయగలిగే టెక్నాలజీ ప్రస్తుత రోజుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు ద్వారా డేటా వేగంగా ట్రాన్స్‌మిట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా లైవ్ మ్యాచుల సమయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని వేగంగా అప్‌డేట్ చేసుకోవచ్చని అంటున్నారు.


బెట్టింగ్ యాప్స్, సమాజం

బెట్టింగ్ యాప్‌లు సాంకేతికంగా చాలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించుకున్నాయి. కానీ ఇదే సమయంలో కొన్ని ఇల్లీగల్ యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చి యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ యాప్‌లు ప్రజల ఆర్థిక స్థితిని చేజార్చడంతో పాటు, అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాయని చెబుతున్నారు. అందుకే, ఇలాంటి యాప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

8th Pay Commission: ఈసారి ఉద్యోగుల శాలరీ ఎంత పెరగనుందంటే..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి


Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 06:49 PM