Share News

‘ఆంధ్రజ్యోతి’ లక్కీ డ్రా నేడే

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:41 AM

అభిమాన పాఠకులు ఎదురుచూస్తున్న ‘ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా’ మంగళవారం జరగనుంది. రేణిగుంట మండలం దామినేడు సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయంలో ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ అదృష్ట పాఠకులు ఎవరన్నది తేలనుంది.

‘ఆంధ్రజ్యోతి’ లక్కీ డ్రా నేడే

మూడు ప్రధాన బహుమతులతో పాటు 125 కన్సొలేషన్‌ కానుకలు

తిరుపతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అభిమాన పాఠకులు ఎదురుచూస్తున్న ‘ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా’ మంగళవారం జరగనుంది. రేణిగుంట మండలం దామినేడు సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయంలో ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ అదృష్ట పాఠకులు ఎవరన్నది తేలనుంది. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా పాల్గొని పాఠకుల నుంచి వచ్చిన వేలాది కూపన్లలో విజేతలను ఎంపిక చేయనున్నారు. ప్రథమ బహుమతి కింద మోటార్‌ బైక్‌, రెండో బహుమతి రిఫ్రజిరేటర్‌, మూడో బహుమతి టీవీని విజేతలకు అందజేయనున్నారు. మరో 125 కన్సొలేషన్‌ బహుమతుల కింద ఒక్కొక్కరికి రూ.2వేలు విలువచేసే గృహోపకరణాలను అందిస్తారు.

2024 నవంబరు 1 నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ మధ్య ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 12 కూపన్లను (4 సెట్లు) పాఠకులు ఇప్పటికే ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పంపారు. జిల్లాలో వేల సంఖ్యలో ఈ కూపన్లు పంపగా, వీరిలో అదృష్టవంతులు ఎవరన్నది మంగళవారం తేలనుంది. డ్రాకు హాజరుకాలేని విజేతలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది. ఈ కూపన్లు మళ్లీ విజయవాడలో జరిగే లక్కీడ్రాకు వెళతాయి. అక్కడి డ్రాలో గెలిచిన రాష్ట్ర విజేతకు మారుతి కారు బహుమతిగా దక్కుతుంది.

Updated Date - Mar 25 , 2025 | 01:41 AM