Summer Tips: ఎండవేడికి అరచేతుల్లో చెమట పడుతున్నాయా.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్..
ABN , Publish Date - Mar 26 , 2025 | 07:53 PM
Prevent Hyperhidrosis: ఎండకాలంలో కొందరికి అరచేతుల్లో చెమటలు పట్టేస్తుంటాయి. ఎంతలా చేతుల నుంచి చెమట నీరు ధారలా కారిపోతూనే ఉంటుంది. ఈ సమస్యను హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇలా జరిగితే శరీరంలోంచి వేగంగా బయటికి నీరు వెళ్లిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. కానీ, ఈ సమస్యను ఈ చిన్నపాటి ఇంటి చిట్కాలతో సులభంగా నివారించవచ్చు.

How to Prevent Hyperhidrosis: వేసవి తరచూ చెమటలు పడుతూ ఉంటాయా.. చేతులంతా తడిగా మారి అసౌకర్యంగా, చికాగ్గా అనిపిస్తోందా.. ఈ సమస్యను హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తారు. వాస్తవానికి ఇది ఒక సాధారణ సమస్యే. మన చెమట గ్రంథులు సాధారణం కంటే ఎక్కువ చురుగ్గా మారినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చెమట పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఒక సహజ మార్గం. కానీ చేతుల్లో అధిక చెమట పట్టడం వల్ల అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదే పదే అరచేతుల్లోంచి నీరు కారే సమస్యకు గల ప్రధాన కారణాలు.. అరికట్టేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..
మీరు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు.. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించినప్పుడు.. హైపర్ హైడ్రోసిస్ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇందుకు గల కారణాలు, పరిష్కారాలు కింద ఉన్నాయి.
చేతుల్లో చెమట పట్టడానికి కారణాలు..
హైపర్ హైడ్రోసిస్: శరీరంలోని స్వేద గ్రంథులు అధిక చెమటను ఉత్పత్తి చేయడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులు, కాళ్ళలోనే ఎక్కువగా చెమట పడుతుంది.
ఒత్తిడి, ఆందోళన: తీవ్రమైన ఒత్తిడి లేదా భయము కలిగినప్పుడు అరచేతుల్లో చెమట పట్టడం సర్వ సాధారణం.
వేడి, తేమతో కూడిన వాతావరణం: వేసవిలో వాతావరణంలో అధిక తేమ కారణంగా మనకు ఎక్కువగా చెమట పడుతుంది.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథిలో లోపాలు ఉన్నవారిని కూడా చేతుల్లో అధిక చెమట సమస్య వేధిస్తుంది.
కెఫీన్, స్పైసీ ఫుడ్స్: ఎక్కువగా స్పైసీ ఫుడ్, కెఫీన్ తీసుకోవడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. తద్వారా చెమట కూడా పెరుగుతుంది.
నివారణా చిట్కాలు..
యోగా, ప్రాణాయామం, కపాలభాతి వంటి లోతైన శ్వాస పద్ధతులు ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా చెమట సమస్య తగ్గుతుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి. ఇది చెమట సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
చేతులకు యాంటీపెర్స్పిరెంట్ పూయడం వల్ల చెమట గ్రంథులు నియంత్రణలోకి వచ్చి చెమట ఎక్కువగా పట్టదు.
బేకింగ్ సోడాలో యాంటీపెర్స్పిరెంట్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో కలిపి మీ చేతులకు పూసుకుంటే చెమట కారడం తగ్గిపోతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఆస్ట్రింజెంట్ లక్షణాలు చేతుల్లో అధిక చెమటను నియంత్రించడంలో సహాయపడతాయి.
చల్లని పుదీనా, వేప నీటితో చేతులు కడుక్కుంటే తాజాగా మారి చెమట సమస్య తగ్గుతుంది.
చేతులకు టాల్కమ్ పౌడర్ వేసుకుంటే చెమటను పీల్చుకుంటుంది. అప్పుడు చేతులు పొడిగా ఉంటాయి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
వేసవిలో చేతులు చెమట పట్టడం సర్వసాధారణం. కానీ ఈ సమస్య కొనసాగితే అది హైపర్ హైడ్రోసిస్ సంకేతం కావచ్చు. సరైన జాగ్రత్తలు, ఇంటి నివారణలు, ఒత్తిడి నిర్వహణతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. కానీ, చేతుల్లో అధిక చెమట మీ దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు పైన పేర్కొన్న నివారణలు ఉపశమనం కలిగించకపోతే మీరు వెంటన వైద్యుడిని సంప్రదించాలి. ఈ పరిస్థితికి డాక్టర్ మందులు లేదా చికిత్సను సిఫారసు చేయవచ్చు.
Read Also :Milk Boiling: పాలు, టీ హీట్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Egg Viral Video: గుడ్డు పెంకు ఈజీగా ఎలా తీశాడంటే.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..
Rat Control: ఎలుకల బాధతో విసిగిపోయారా.. ఇలా చేస్తే చంపకుండానే ఇంట్లో నుంచి మాయమవుతాయి..