Share News

ఎస్సీ రుణమే కదా.. ఎగ్గొడితే పోలా..!

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:27 AM

ఎస్సీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ రుణాలను విరివిగా మంజూరు చేసింది. వివిధ రంగాల్లో అనుభవం ఉన్నవారికి వారు కోరుకున్న యూనిట్లను మంజూరు చేసింది. అలాగే ఇన్నోవా, ఎతియోస్‌ వాహనాలను కూడా రుణాలపై ఇచ్చింది. ఇన్నోవా వాహనం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలుంటే.. ఎతియోస్‌ వాహనం రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండేది. ఇందులో లబ్ధిదారు మహిళల అయితే 50 శాతం, పురుషుడైతే 35 శాతం రాయితీ ఇచ్చారు. వీటిని తీసుకున్న లబ్ధిదారులు తిరిగి రుణం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. రికవరీకోసం అధికారులేమో లబ్ధిదారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఎస్సీ రుణమే కదా.. ఎగ్గొడితే పోలా..!

. 2016-19 మధ్యలో 145 ఇన్నోవా,

. తియోస్‌ వాహనాల మంజూరు

. రూ.15.05 కోట్లకు ఇప్పటివరకు

కట్టింది రూ.3.66 కోట్లు మాత్రమే

ఎస్సీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ రుణాలను విరివిగా మంజూరు చేసింది. వివిధ రంగాల్లో అనుభవం ఉన్నవారికి వారు కోరుకున్న యూనిట్లను మంజూరు చేసింది. అలాగే ఇన్నోవా, ఎతియోస్‌ వాహనాలను కూడా రుణాలపై ఇచ్చింది. ఇన్నోవా వాహనం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలుంటే.. ఎతియోస్‌ వాహనం రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండేది. ఇందులో లబ్ధిదారు మహిళల అయితే 50 శాతం, పురుషుడైతే 35 శాతం రాయితీ ఇచ్చారు. వీటిని తీసుకున్న లబ్ధిదారులు తిరిగి రుణం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. రికవరీకోసం అధికారులేమో లబ్ధిదారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

టీడీపీ హయాంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 13 మందికి ఇన్నోవా, 9మందికి ఎతియోస్‌ కార్లను మంజూరు చేసింది. ఈ 22 మంది కలిపి రూ.2.10 కోట్ల కట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.93లక్షలు మాత్రమే చెల్లించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 39 మందికి ఇన్నోవా, 11 మందికి ఎతియోస్‌ కార్లను మంజూరు చేశారు. వీరు రూ.5.45 కోట్లకుగాను రూ.1.33 కోట్లు మాత్రమే చెల్లించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 50మందికి ఇన్నోవా, 23మందికి ఎతియో్‌సకార్లను మంజూరు చేశారు. వీరు రూ.7.48 కోట్లకు ఇప్పటివరకు రూ.1.39 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ విధంగా 2016-19 వరకు 145 మంది ఇన్నోవా, ఎతియోస్‌ కార్లను తీసుకున్నారు. వీరంతా కలిపి రూ.15.05 కోట్లకుగాను రూ.3.66 కోట్లను మాత్రమే ఇప్పటివరకు చెల్లించారు.

పలు కారణాలు చూపుతూ..

ఇన్నోవా వాహనం తీసుకున్న లబ్ధిదారుడు నెలకు సుమారు రూ.23వేలు చెల్లించాల్సి ఉంది. ఎతియోస్‌ కారు తీసుకున్నవారు నెలకు రూ.7,500 నుంచి రూ.8వేల వరకు కట్టాలి. 2019, 2020లో కరోనా కారణంగా కంతులను కట్టలేమని చెప్పడంతో ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయలేకపోయింది. 2021 నుంచి ఇప్పటివరకు వాహనాలు బాడుగలకు పోవడం లేదని కొందరు చెబుతుంటే, ఇంకొందరు అనారోగ్య సమస్యలను చూపుతూ చెల్లింపులు చేయడం లేదు. మరికొందరు ఎల్లో బోర్డు కారణంగా ట్యాక్స్‌ అధికంగా వస్తోందన్న కారణాన్ని చూపుతున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ అఽధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్చరికలు జారీ చేస్తున్నా..

వాహనాలను తీసుకునే సమయంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ ఇచ్చారు. మరికొందరు తమ ఇంటి పత్రాలు, భూముల పత్రాలను ష్యూరిటీ కింద ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు ఇచ్చారు. వీటి ఆధారంగా కార్పొరేషన్‌ అధికారులు వారికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. బృందాలుగా ఏర్పడి రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారులు వస్తున్నారని తెలిసిన లబ్ధిదారులు తమ ఫోన్లను స్విచాఫ్‌ చేసుకుని ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు.

ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆలోచనలో..

20 ఏళ్లకు ముందు సబ్సిడీ రుణాల మొత్తాలను అప్పటి ప్రభుత్వం మాఫీ చేసింది. అదే తరహాలో ఇప్పుడు కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందన్న ఆలోచనలో లబ్ధిదారులు ఉన్నారు. అందువల్లే చాలామంది కంతులను కట్టడం లేదని సమాచారం.

నోటీసులు ఇస్తున్నాం

2016 నుంచి 2019 వరకు ఇన్నోవా, ఎతియోస్‌ కార్లను తీసుకున్న లబ్ధిదారులు సరిగా కంతులు కట్టడం లేదు. దీంతో వీరికి ష్యూరిటీ ఇచ్చినవారికి ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరిస్తున్నాం. చివరి ప్రయత్నంగా లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నాం. స్పందించకపోతే ఏం చేయాలో కలెక్టర్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.

- చెన్నయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

Updated Date - Mar 24 , 2025 | 01:27 AM