Price Comparison: కిలో బియ్యం, పప్పు ధర రూ.30 పైసలు.. ఎప్పుడంటే
ABN , Publish Date - Mar 26 , 2025 | 08:38 PM
ఒకప్పుడు 1960లో కేజీ బియ్యం ధర ఎంతో 50 పైసలు. కానీ ఇప్పుడు 2025 నాటికి భారీగా పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో మిగతా ఉత్పత్తుల ధరలు ఎలా ఉన్నాయి. ఎందుకు పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ప్రస్తుతం కిలో బియ్యం 60 రూపాయలకుపైగా పలుకుతోంది. ఇదే రైస్ 1960లో 30 నుంచి 60 పైసలు మాత్రమే ఉండేది. కానీ 65 ఏళ్ల క్రితం ఉన్న ధరలు, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మాదిరిగా అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు చేతిలో రూపాయి ఉంటే చాలు బియ్యం వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం బియ్యం కొనాలంటే వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ధరలు ఎందుకు పెరిగాయి. ఇదే సమయంలో ఇతర ఉత్పత్తుల ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1960లో బియ్యం ధర
1960లో భారతదేశంలో బియ్యం ధర కిలోకు దాదాపు 30-50 పైసలు ఉండేది. ఒక రూపాయికి 2-3 కిలోలు బియ్యం వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో దేశం ఆర్థికంగా చాలా మారిపోయింది. అప్పుడు జనాలు తక్కువ, వ్యవసాయ ఉత్పత్తి కూడా స్థిరంగా ఉండేది. కానీ, ఇప్పుడు జనాలు ఎక్కువ, దీనికి తోడు ఆహార ఉత్పత్తి స్థిరంగా లేకపోవడం, వర్షాభావం, కరువు వంటి కారణాల వల్ల ధరలు పెరగడం ప్రారంభించాయి.
1970లో బియ్యం ధర
1970 నాటికి బియ్యం ధర 75 పైసల నుంచి 1 రూపాయికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహార ఉత్పత్తి తగ్గడం, జనాభా పెరగడం. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావితం చేశాయి.
పంచదార ధర
1960లో పంచదార ధర కిలోకు 1-1.25 రూపాయలు ఉండేది. కానీ, 1970 నాటికి ఈ ధర 1.50-2 రూపాయల మధ్యకు చేరుకుంది. చెరకు ఉత్పత్తిలో సమస్యలు, వాతావరణ మార్పులు, ఇతర ఉత్పత్తి సమస్యలు పంచదార ధర పెరగడానికి కారణం అయ్యాయి.
కందిపప్పు ధర
1960లో కందిపప్పు ధర కిలోకు 80 పైసల నుంచి 1 రూపాయిగా ఉండేది. కానీ 1970 నాటికి ఈ ధర 1.50-2 రూపాయల మధ్యకు పెరిగింది. పప్పుల ఉత్పత్తిలో తగ్గుదల, దిగుమతులపై ఆధారపడటమే దీనికి కారణం.
పెసరపప్పు ధర
పెసరపప్పు (మూంగ్ దాల్) ధర 1960లో కిలోకు 70 పైసల నుంచి 1.25-1.50 రూపాయలు మధ్య ఉండేది. పప్పు ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల 1970 నాటికి ధరలు పెరిగాయి.
చింతపండు ధర
1960లో చింతపండు ధర కిలోకు 50-60 పైసలు ఉండేది. అయితే 1970 నాటికి ఈ ధర 1-1.25 రూపాయలకు చేరింది. వర్షాభావం కారణంగా ఉత్పత్తి తగ్గడం వలన ఈ ధర పెరిగింది.
ఎండు మిర్చి ధర
ఎండు మిర్చి 1960లో కిలోకు 2-3 రూపాయలు ఉండేది. 1970లో ఇది 4-5 రూపాయల మధ్యకు చేరింది. దీని ఉత్పత్తి పరిమితమవ్వడం, ఇతర సమస్యలు ఈ ధర పెరగడానికి కారణమయ్యాయి.
ఉల్లిపాయల ధర
1960లో ఉల్లిపాయలు ధర కిలోకు 25-40 పైసలు ఉండేది. అయితే, 1970 నాటికి ఈ ధర 50-75 పైసలకు చేరుకుంది. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితులు సరఫరాకు అడ్డంకులుగా మారాయి. దీంతో ధరలు పెరిగాయి.
పచ్చిమిర్చి ధర
1960లో పచ్చిమిర్చి ధర కిలోకు 1-1.50 రూపాయలు ఉండేది. 1970 నాటికి ఇది 2-2.50 రూపాయలు చేరింది. పచ్చిమిర్చి ధరలు ఎక్కువగా సీజనల్ కారణాల వల్ల మారాయి. సాధారణంగా వర్షాలు, ఉత్పత్తి పరిమితి వంటి అంశాలు దీని ధరను ప్రభావితం చేశాయి.
బెల్లం ధర
1960లో బెల్లం ధర కిలోకు 80 పైసల నుంచి 1 రూపాయిగా ఉండేది. 1970లో ఇది 1.25-1.75 రూపాయల మధ్య పెరిగింది. బెల్లం కూడా పంట దిగుబడి తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగాయి.
ధరలు పెరగడానికి గల కారణాలు
ఈ అన్ని ఉత్పత్తుల ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. 1965-66లో బీహార్‌లో సంభవించిన కరువు, వర్షాభావం, ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండడం వంటి కారణాలతో ధరలు పెరిగాయి. అప్పుడు ఒక సాధారణ కుటుంబం నెలకు రూ. 100 సంపాదించేవారు. కానీ ఆ సమయంలో ఆహార ధరలు పెరిగిన కారణంగా వారి కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
ప్రభుత్వం చర్యలు
అప్పటి ప్రభుత్వం ధరలను నియంత్రించడానికి రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసింది. అలాగే, దిగుమతులు కూడా నిర్వహించారు. కానీ 1970 నాటికి గ్రీన్ రివల్యూషన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగిన తరువాత కొంత ఉపశమనం లభించి ఆహార ధరలు స్థిరపడ్డాయి. కానీ 2025 నాటికి పెరిగిన జనాభా వాతావరణ సంక్షోభం, తగ్గిన ఆహార ఉత్పత్తులు, ఆర్థిక అసమానతలు, పెట్టుబడి విధానాలు సహా అనేక అంశాల కారణంగా వీటి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News