Share News

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే..!

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:08 AM

దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తూ పోతే క్షయ (టీబీ)గా మారుతుంది. ఆపైనా పట్టించుకోకుంటే ప్రాణాంతకమవుతుంది. అదే.. మొదట్లోనే గుర్తిస్తే క్షయ నుంచి బయట పడొచ్చు. జిల్లాలో దాదాపు రెండు వేల మంది వరకు క్షయ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. వీరిలో 1200 మంది ప్రభుత్వ, 800 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి అవసరమైన మందులను ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. క్షయ పడిన బాధితులకు నిక్షయ పోషణ కింద కేంద్ర ప్రభుత్వం పోషకాహారంతోపాటు ఆరు నెలల చికిత్సా సమయంలో రూ.6 వేలను జీవన భృతికి అందిస్తోంది. ప్రాథమిక, ఏరియా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో టీబీ మందులను ఉచితంగా అందిస్తున్నారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే..!
డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి

- ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యం

- నేడు వరల్డ్‌ టీబీ డే

దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తూ పోతే క్షయ (టీబీ)గా మారుతుంది. ఆపైనా పట్టించుకోకుంటే ప్రాణాంతకమవుతుంది. అదే.. మొదట్లోనే గుర్తిస్తే క్షయ నుంచి బయట పడొచ్చు.

జిల్లాలో దాదాపు రెండు వేల మంది వరకు క్షయ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. వీరిలో 1200 మంది ప్రభుత్వ, 800 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి అవసరమైన మందులను ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. క్షయ పడిన బాధితులకు నిక్షయ పోషణ కింద కేంద్ర ప్రభుత్వం పోషకాహారంతోపాటు ఆరు నెలల చికిత్సా సమయంలో రూ.6 వేలను జీవన భృతికి అందిస్తోంది. ప్రాథమిక, ఏరియా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో టీబీ మందులను ఉచితంగా అందిస్తున్నారు.

లక్షణాలు: విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, చలి వేయడం, రాత్రి వేళ చెమటలు పట్టడం.

క్షయ నిర్మూలనే లక్ష్యం

జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించే దిశగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా మా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లాలోని క్షయ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మందులు ఇస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్థులు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడాలి.

- డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌, క్షయ నివారణ అధికారి

ఇంట్లో వాళ్లూ జాగ్రత్తగా ఉండాలి

మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉంటే దానిని క్షయగా నిర్ధారిస్తారు. ఇది అంటువ్యాధి. కాబట్టి దీని బారిన పడిన వారు ఇంట్లో ఉంటే మిగిలిన వారూ జాగ్రత్తగా ఉండాలి. రుయాస్పత్రిలోని ఏఆర్‌టీ కేంద్రంలో అవసరమైన మందులు ఉన్నాయి.

- డాక్టర్‌ సుబ్బారావు, ఊపిరితిత్తుల, శ్వాసకోశ వైద్య నిపుణుడు, రుయాస్పత్రి

- తిరుపతి(వైద్యం), ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 24 , 2025 | 02:08 AM