పోలీసుల్ని ఇష్టానికి బదిలీ చేశారు
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:42 AM
జిల్లాలో పోలీసుల్ని ఇష్టానుసారం బదిలీ చేసి వాళ్లింట్లో మమ్మల్ని తిట్టుకునేలా చేశారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం పలమనేరులో నిర్వహించిన టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల సమావేశంలో ఆయన బదిలీల విషయమై స్పందించారు. ‘వైసీపీకి పనిచేసిన పోలీసులను మార్చమని నేను చెప్తే.. ఇష్టానికి బదిలీలు చేశారు. వాళ్లింట్లో పెళ్లాం, పిల్లలు నన్ను తిట్టుకునేలా చేస్తున్నారు. మనం శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి అనుగుణంగా పనిచేస్తారు. గత ప్రభుత్వ హయాం నుంచీ పని చేస్తున్నవారికి ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉంటాయని పక్కకు మార్చమని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా ఈ మూల నుంచి ఆ మూలకు విసిరేశారు’ అన్నారు.

- వాళ్లింట్లో మమ్మల్ని తిట్టుకుంటున్నారు
- ఎమ్మెల్యే అమరనాథరెడ్డి
పలమనేరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసుల్ని ఇష్టానుసారం బదిలీ చేసి వాళ్లింట్లో మమ్మల్ని తిట్టుకునేలా చేశారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం పలమనేరులో నిర్వహించిన టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల సమావేశంలో ఆయన బదిలీల విషయమై స్పందించారు. ‘వైసీపీకి పనిచేసిన పోలీసులను మార్చమని నేను చెప్తే.. ఇష్టానికి బదిలీలు చేశారు. వాళ్లింట్లో పెళ్లాం, పిల్లలు నన్ను తిట్టుకునేలా చేస్తున్నారు. మనం శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి అనుగుణంగా పనిచేస్తారు. గత ప్రభుత్వ హయాం నుంచీ పని చేస్తున్నవారికి ఆ పార్టీ నాయకులతో సంబంధాలు ఉంటాయని పక్కకు మార్చమని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా ఈ మూల నుంచి ఆ మూలకు విసిరేశారు’ అన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన నేపథ్యంలో అమరనాథరెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఎస్పీ మణికంఠ తీరు వల్లే హత్య జరిగిందని, వైసీపీ హయాం నుంచి అవే స్థానాల్లో కొనసాగుతున్న పోలీసుల్ని బదిలీ చేయలేదని ఆరోపించారు. దీంతో ఎస్పీ ఇటీవల 264 మంది పోలీసుల్ని దూర ప్రాంతాలకు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.