Crime News: అది వైరల్ కావడంతో భర్త నన్ను దూరం పెట్టాడు.. ఓ భార్య ఆవేదన..
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:30 AM
భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు.

తిరుపతి: రామచంద్రాపురం మండలం, కుప్పం బాదూరు కొత్త కండ్రిగకు చెందిన భర్త (Husband) వేధింపులపై బాధితురాలు (Harassment) శ్రీదేవి (Sridevi) ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో యాప్ లో న్యూడ్ కాల్స్ (Nude Call ) మాట్లాడాలని భర్త వేధింపులకు గురి చేశాడని శ్రీదేవి అన్నారు. న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ భర్త ఒత్తిడి తెచ్చాడని, చామెట్ (ఛిల్ల్ చాట్) యాప్‌లో తన భర్త సుబ్రహ్మణ్య రెడ్డి (Subrahmanya Reddy) ఐడీ క్రియేట్ చేశాడని... తద్వారా రూ.18 లక్షలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశామన్నారు. ఈ నేపథ్యంలో న్యూడ్ వీడియో వైరల్ కావడంతో భర్త తనను దూరం పెట్టాడని, తన వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు పెట్టేందుకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అక్కడి కానిస్టేబుల్ రమణ తనను లైంగికంగా వేధించాడని, అసభ్యకర మెసేజులు పెట్టి.. రాత్రికి రమ్మని వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు శ్రీదేవి వాపోయింది.
ఈ వార్త కూడా చదవండి..
కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..
భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమెను బెదిరించి ఓ యాప్ ద్వారా భర్త సుబ్రహ్మణ్యం రెడ్డి తన భర్యతో న్యూడ్ కాల్స్ చేయించాడు.. అలా చేసినా న్యూడ్ కాల్స్ ద్వారా బాగానే సంపాదించామని, తరువాత ఆర్థిక పరిస్థితి బాగుందని ఇక నేను అలాంటి పనులు చేయానని భార్య శ్రీదేవి భర్తతో చెప్పానని... దీంతో తనపై దాడులు చేయడంతో పాటు చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.. న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని.. లేదంటే పిల్లలు ఇవ్వనని చెబుతూ.. తీవ్రంగా కొట్టి.. ఇంటి నుంచి గెంటివేశాడని శ్రీదేవి వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..
బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News