Share News

Tirumala: టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. విషయం అదేనా..

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:48 PM

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి మరికాసేపట్లో అత్యవసర భేటీ కానుంది. ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశం నిర్వహించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించారు.

Tirumala: టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం.. విషయం అదేనా..
TTD Governing Council meeting

తిరుమల: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి (TTD Governing Council) మరికాసేపట్లో అత్యవసర భేటీ కానుంది. ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశం నిర్వహించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) నిర్ణయించారు. తొక్కిసలాట ఘటన, ఇలాంటి ఘటనలు పునరావృతి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి సేవలు అందించడం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

Minister Savitha: జగన్ శవరాజకీయాలు మళ్లీ మెుదలుపెట్టారు: మంత్రి సవిత..


తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులతో నిన్న (గురువారం) రిప్యూ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. స్వామివారి పుణ్యక్షేత్రంలో ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఉండకూడదని సీఎం వారిని హెచ్చరించారు. తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకూదని తీవ్రంగా హెచ్చరించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Amaravti: రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ఆఖరి గడువు ఇదే


ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఆసక్తి రేకెత్తిస్తోంది. తోపులాట ఘటనతోపాటు రివ్యూ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై పాలకమండలి చర్చించనుంది. అయితే అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు ముందుగా విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్, సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాలకమండలి సమావేశం నిర్వహించేందుకు శ్యామలరావు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం ఎటువంటి అంశాలను వెల్లడిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది

Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి

Updated Date - Jan 10 , 2025 | 03:51 PM