ఇద్దరు టెన్త్ విద్యార్థుల డీబార్
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:45 AM
జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో కేవీబీపురంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు.

ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసిన డీఈవో
తిరుపతి(విద్య), మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షల్లో కేవీబీపురంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను ఇన్విజిలేటర్లు బి. యాదగిరి, ఎస్.దివాకర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, సోమవారం నాటి పరీక్షకు 26,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. 518 మంది గైర్హాజరయ్యారు.