వైద్యార్తులకు దారిదీపమైన ‘వైద్య జ్యోతి’
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:02 AM
ఏబీన్- ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘వైద్యజ్యోతి’ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా హెల్త్‌మీట్.. వైద్యార్తులకు దారిదీపంలా మారింది. తిరుపతిలోని తుడా ఇందిరా మైదానంలో శని, ఆదివారాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంతో పాటు జిల్లాలోని పలుప్రాంతాలనుంచి చికిత్స కోసం, వైద్యసలహాల కోసం రోగులు పోటెత్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన వైద్యజ్యోతిలో దాదాపు నాలుగు వేల మంది రోగులను వైద్యులు పరీక్షించి.. అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. మందులూ ఉచితంగా అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆయా ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఎన్టీఆర్ వైద్యసేవ అర్హులైనవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని చెప్పడంతో పాటు వైద్యసేవ పరిధిలో లేని వ్యాధులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. ఇలాంటి హెల్త్‌మీట్‌లలో అన్ని రకాల వైద్యనిపుణులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉండిందని రోగులు అన్నారు. భవిష్యత్తులోనూ ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటామని వైద్యులు తెలిపారు. ఇక, శిబిరంలో శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తరపున డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పాల్గొని కంటి సమస్యతో బాధపడే రోగులను పరీక్షించి కంటి అద్దాలు అందజేశారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో వైద్యులు, సిబ్బందికి ‘వైద్యజ్యోతి’ జ్ఞాపికలను ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్ సురే్‌షరెడ్డి, సిబ్బంది అందజేశారు.

- ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు నిర్వహణ
- అనూహ్య స్పందనతో ముగిసిన హెల్త్‌మీట్
తిరుపతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏబీన్- ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘వైద్యజ్యోతి’ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా హెల్త్‌మీట్.. వైద్యార్తులకు దారిదీపంలా మారింది. తిరుపతిలోని తుడా ఇందిరా మైదానంలో శని, ఆదివారాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంతో పాటు జిల్లాలోని పలుప్రాంతాలనుంచి చికిత్స కోసం, వైద్యసలహాల కోసం రోగులు పోటెత్తారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన వైద్యజ్యోతిలో దాదాపు నాలుగు వేల మంది రోగులను వైద్యులు పరీక్షించి.. అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. మందులూ ఉచితంగా అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆయా ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఎన్టీఆర్ వైద్యసేవ అర్హులైనవారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని చెప్పడంతో పాటు వైద్యసేవ పరిధిలో లేని వ్యాధులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. ఇలాంటి హెల్త్‌మీట్‌లలో అన్ని రకాల వైద్యనిపుణులను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉండిందని రోగులు అన్నారు. భవిష్యత్తులోనూ ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటామని వైద్యులు తెలిపారు. ఇక, శిబిరంలో శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తరపున డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పాల్గొని కంటి సమస్యతో బాధపడే రోగులను పరీక్షించి కంటి అద్దాలు అందజేశారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో వైద్యులు, సిబ్బందికి ‘వైద్యజ్యోతి’ జ్ఞాపికలను ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్ సురే్‌షరెడ్డి, సిబ్బంది అందజేశారు.