దేశాభివృద్ధిలో యువతే కీలకం
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:10 PM
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.శ్రీనివాసులు అన్నారు.

- కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.శ్రీనివాసులు
కోస్గి రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.శ్రీనివాసులు అన్నారు. భారత ప్రభుత్వం యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరి యంలో యువజన ఉత్సవం-2025 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యువతీ, యువకులు నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిం చిన డెవలప్ ఇండియా-2047 కోసం ప్రతీ యువత కష్టపడి మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపాలన్నారు. మునిసిపల్ కమిషనర్ నాగ రాజు, ఉమ్మడి జిల్లా యువజన అధికారి వి.కోటానాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.