Share News

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:03 PM

అయిజలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలి

బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు రామాంజనేయులు

అయిజ టౌన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అయిజలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. బీజేపీ అయిజ మండల అధ్య క్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం కోసం బుధవారం ఏర్పాటు చేసిన ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. మునిసిపాలిటీలో 20వార్డులు, మండలంలో 28 గ్రామపంచాయతీలు ఉన్న అయిజలో పర్మినెంట్‌గా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం ఉండాలన్నా రు. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరే మండలం కూడా అయిజనే అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా అయిజలో పెద్దఎత్తున జరుగుతుండడంతో ప్రజలు వారి ఆర్థిక స్థోమతను బట్టి ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారని అన్నారు. కొనుగోలు అనంతరం రిజిస్ర్టేషన్‌ కోసం 30కిలోమీటర్ల దూరంలో ఉం డే గద్వాలకు వెళ్లటం ప్రజలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంకాగా, ఒక రోజంతా వ్యవసాయ పనులు, సొంత పనులు వదులుకోవల సి వస్తుందన్నారు. మండలంలోని కుట్కనూరు గ్రామ వ్యక్తులు గద్వాలకు వెళ్లాలంటే రానూపో ను 110 కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్ర భుత్వం అయిజలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా మాజీ అఽధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు శివారెడ్డి, నాగరాజు, శ్రీను, భీంసేన్‌రావ్‌, లక్ష్మన్‌గౌడు, నర్సింహులు, వీరయ్య ఆచారి, రామకృష్ణ, వీరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:03 PM