Share News

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:12 PM

వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం మునిసిపాలిటీలోని అమిస్తాపూర్‌ ఊరడి పెంటన్న ఇంటికి వచ్చిన సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మాట్లాడారు. యాసాంగిలో పంటలు సాగు చేసుకున్న రైతులకు వడగళ్ల రూపంలో మండలంలోని మద్ధిగట్ల, కర్వెన, భట్టుపల్లి, వెల్కిచర్ల గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా పాడైపోయాయని, వారికి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఒక వైపు భూగర్భ జలాలు అడుగంటి పోయి ఉన్న పంటలు కాస్త ఎండిపోయి నష్టాల్లో ఉన్న రైతులకు వడగళ్లు కురిసి పంటలను పూర్తిగా నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మురళిధర్‌గౌడ్‌, మూస బాలస్వామి, నారాయణగౌడ్‌, సత్యనారాయణ, అజ్జుభాయ్‌, అశోక్‌గౌడ్‌, జాకీర్‌పాషా, ఆగిరి సత్యం, గోప్లాపూర్‌ సత్యనారాయణ, సాయిలప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:12 PM