Share News

కులమతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:08 PM

నారాయణపేట జామే మస్జీద్‌ లో బుధవారం సాయంత్రం ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పాల్గొని ముస్లింలకు పండ్లు తినిపించి, మాట్లాడారు.

కులమతాలకతీతంగా పండుగలు జరుపుకోవాలి
పేటలో మాజీ కౌన్సిలర్‌ తఖీచాంద్‌కు పండ్లు తినిపిస్తున్న ఎస్పీ

- ఇప్తార్‌ విందులో ఎస్పీ

నారాయణపేట/కోస్గి/ మరికల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జామే మస్జీద్‌ లో బుధవారం సాయంత్రం ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పాల్గొని ముస్లింలకు పండ్లు తినిపించి, మాట్లాడారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్‌ అ న్నారు. జిల్లా ప్రజలంతా కులమతాలకు అతీతంగా సోదర భావంతో పండుగలు జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీ లింగయ్య, సీ ఐ శివశంకర్‌, మాజీ కౌన్సిలర్లు తఖీచాంద్‌, అమిరొద్దీన్‌, దస్తగిరి, చాంద్‌ తదితరులున్నారు.

అదేవిధంగా, కోస్గి పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలోని ఆయిషియ మసీదు ఆవరణలో ప్రభుత్వం తరుఫున అధికారులు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. మునిసిపాలిటీ పరిధిలోని ముస్లింలు హాజరై ఉపవాస దీక్షను విరమించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ మునిసిపల్‌ అధ్య క్షుడు బెజ్జు రాములు, మైనార్టీ నాయకులు ఇద్రిస్‌, ఆసిఫ్‌, రియాజ్‌, ఫెరోజ్‌ సలీం ఉన్నారు.

మరికల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మైనార్టీ నాయకుల సహకారంతో మజీద్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఇఫ్తార్‌ విందులో మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ముస్లింలకు పండ్లు తినిపించి, ఉపవాస దీక్షకు విరమింపజేశారు. ఆ తర్వాత ముస్లింలు మాజీ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో రాజవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్‌, సంపత్‌, బసంతు, సూరిటి శ్రీనివాసులు, మైనార్టీ పెద్దలు ఉన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:08 PM