చారిత్రక కొత్తబావిని కబ్జా నుంచి కాపాడాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:04 PM
గద్వాలలోని చారిత్రక కొత్తబావి కబ్జాకు గురి కాకుండా కాపాడాలని సీనియర్ సిటిజన్స్ ఫో రం అధ్యక్షుడు మోహన్‌రావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ ప్రభాకర్, పౌరహక్కుల సంఘం ఉమ్మడి కార్యవర్గ సభ్యుడు మహదేవ్ కోరారు.

గద్వాల టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గద్వాలలోని చారిత్రక కొత్తబావి కబ్జాకు గురి కాకుండా కాపాడాలని సీనియర్ సిటిజన్స్ ఫో రం అధ్యక్షుడు మోహన్‌రావు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ ప్రభాకర్, పౌరహక్కుల సంఘం ఉమ్మడి కార్యవర్గ సభ్యుడు మహదేవ్ కోరారు. బుధవారం జిల్లా పర్యటనలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇ చ్చారు. ఇటీవల బావి పూడ్చివేత, కబ్జా కోసం జరుగుతున్న ప్రయత్నాలను సంపత్‌కుమార్‌కు వివరించిన నాయకులు చారిత్రక కట్టడాలు, బా వుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తగిన సహకారం అందించాలని కో రారు. దీనిపై స్పందించిన సంపత్‌కుమార్ పు రాతన కట్టడాల పరిరక్షకు సంబంధించి ప్రభు త్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసు కుందని, టూరిజం పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేపట్టిందని, కబ్జాలు జరిగితే కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టిందని తెలిపినట్లు ఫిర్యాదుదా రులు తెలిపారు. కాగా, పూర్వ గద్వాల హైస్కూ ల్ విద్యార్థిగా తనకు కొత్తబావి చరిత్ర గురించి కొంత తెలుసని, బావి రక్షణకు సంబంధించి కలెక్టర్‌తో మాట్లాడుతానని తెలిపినట్లు ఫిర్యాదు దారులు వివరించారు.