పట్టుబడిన గ్రావెల్ ఎక్కడ?
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:43 AM
అధికారులు 50 రోజుల కింద పట్టుకున్న గ్రావెల్.. నాలుగు రోజుల క్రితం మాయమైపోయింది. అక్రమార్కులు తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని వెనుక కొందరు అధికారుల అండ ఉందన్న ఆరోపణలున్నాయి.

సూళ్లూరుపేట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అధికారులు 50 రోజుల కింద పట్టుకున్న గ్రావెల్.. నాలుగు రోజుల క్రితం మాయమైపోయింది. అక్రమార్కులు తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని వెనుక కొందరు అధికారుల అండ ఉందన్న ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి 2న సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరులోని జగనన్న ఇళ్ల కాలనీలోని ప్లాట్ల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించి.. పెట్రోల్ బంక్ సమీపాన నిల్వ చేసి.. టిప్పర్ల ద్వారా వెంచర్లకు తరలిస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదుతో గ్రావెల్ నిల్వలతో పాటు టిప్పర్‌నూ అధికారులు సీజ్‌చేశారు. పోలీసులకూ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దాదాపు 30 టిప్పర్లకుపైగా గ్రావెల్ నిల్వలను సీజ్‌చేశారు. కానీ.. నాలుగు రోజుల కిందట ఆ గ్రావెల్‌ను అక్రమార్కులు రాత్రివేళ ఎక్స్‌కవేటర్ల సాయంతో టిప్పర్లకు లోడ్‌చేసి తీసుకెళ్లారు. గ్రావెల్ నిల్వల మాయం వెనుక కొందరి అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు.