న్యాయ వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేయండి
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:49 AM
న్యాయ వ్యవస్థ పటిష్ఠతకు న్యాయవాదులు కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కుప్పం న్యాయస్థానాన్ని సందర్శించారు.

- మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ.రమణ
కుప్పం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థ పటిష్ఠతకు న్యాయవాదులు కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కుప్పం న్యాయస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో జస్టిస్ ఎన్వీ.రమణ మాట్లాడుతూ న్యాయవాదులు ఎవరైనా సరే న్యాయం పక్షమే వహించాలని, న్యాయమూర్తులు న్యాయాన్యాయాల విచారణలో చట్టాలను అనుసరించి వెళ్లాలని ఉద్బోధించారు. శిథిలావస్థలో ఉన్న కోర్టు భవన దుస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి నూతన భవన ఆవశ్యకత గురించి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున జస్టిస్ ఎన్వీ రమణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి వరుణ తేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసీ.చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి ఉదయకుమార్, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.