AP CM Chandrababu Foreign Trip: నేడు విదేశీ పర్యటనకు సీఎం కుటుంబం
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:05 AM
విడేశీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో 20వ తేదీన ఆయన 75వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడినుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్ దంపతులు వెళుతున్నారు. ఈ పర్యటనలోనే ఈనెల 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నారు.