Krishna Karakatta Road: కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణకు పచ్చజెండా
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:41 AM
అమరావతిలో కృష్ణా కరకట్ట రహదారిని నాలుగు వరసలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలుచేయడానికి ఏడీసీ సిద్ధమవుతోంది.

4 వరసల రహదారికి సీఎం చంద్రబాబు అనుమతి
రోడ్డుకు రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం
వారం రోజుల్లో టెండర్లు పిలువనున్న ఏడీసీఎల్
రూ.1,200 కోట్ల వ్యయంతో 7 కి.మీ. మేర విస్తరణ
విజయవాడ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా కరకట్ట రోడ్డును నాలుగు వరసలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ప్రకాశం బ్యారే జీ దిగువన కొండవీడు వాగు నుంచి రాయపూడి వరకు ఈ రహదారి విస్తరణకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ప్రతిపాదనకు ఆయన మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చింది. కృష్ణానది వరదను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కరకట్ట రోడ్డు దుర్భేద్యంగా ఉండేలా ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీంతో రెండురోజుల్లో మంత్రి, అధికారులు భేటీ కాబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సీఎంతో చర్చించి అనుమతులు తీసుకున్న మేరకు కరకట్ట రహదారి పొడవు 7 కి.మీ.. సెంట్రల్ డివైడర్‌తో నాలుగు వరసల విధానంలో ఉంటుంది. ముందుగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎర్త్‌వర్క్, వెట్‌మిక్స్, హాట్ మిక్స్ వంటి పనులు చేపట్టి బీటీ లేయర్ వేస్తారు. సెంట్రల్ మీడియం, సెంట్రల్ లైటింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని ఏడీసీ అధికారులు అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News