వైభవంగా శ్రీపుష్పోత్సవం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:05 AM
ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆత్రేయపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు, తులసిపూజ, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ఆయా ఏర్పాట్లు నిర్వహించారు. వారం రోజులపాటు నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి.