పారదర్శకంగా భూ రీసర్వే
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:21 AM
: జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో మూడు గ్రామా ల్లో రీసర్వేను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని సమగ్రంగా రీసర్వే నిర్వహించడం జరుగుతుం దని జేసీ ఎస్.చిన్నరాముడు పేర్కొన్నారు.

దేవరపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో మూడు గ్రామా ల్లో రీసర్వేను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని సమగ్రంగా రీసర్వే నిర్వహించడం జరుగుతుం దని జేసీ ఎస్.చిన్నరాముడు పేర్కొన్నారు. చిన్నాయిగూడెంలో గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రీసర్వే గ్రామ సభ లో ఆయన మాట్లాడారు. రీసర్వే పనులకు రైతులు పూర్తి సహాయ సహకారాలు అందించా లన్నారు. ప్రతి రైతుకు 19 నోటీసులు జారీ చేయడం జరుగుతుందని.. రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్వేలో అభ్యంతరాలేమైనా ఉంటే మండల సర్వేయర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చిన్నాయిగూడెంలో 5 వేల ఎకరాల భూమి ఉందని దీనిలో జమిందారుభూమి కావడం వల్ల అన్ని కోణాల్లో పరిశీలించి సర్వే చేయడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించి 5 సెంట్లు పైబడి తేడాలుంటే సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. అడంగళ్ ,పట్టాదారు పాస్‌పుస్తకం, డాక్యుమెంట్ ఆధారాలతో రీసర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతు చిల కా రాజేశ్ మాట్లాడుతూ తనుకు మూడు ఎక రాలన్నర డాక్యుమెంట్ ఉందని.. భూమి ఎకరం 70 సెంట్లు మాత్రమే ఉందని రీసర్వేలో ఎక్కడుందో గుర్తించాలని రెవెన్యూ అధికారు లను కోరారు. రైతు మాజీ ఏఎంసీ చైర్మన్ గడా మురళి అజిత్‌కుమార్ మాట్లాడుతూ చిన్నాయి గూడెంలో పాలేటి వాగు భూమి ఒక వైపు ఉంటే నీరు ప్రవాహం రైతు పొలాల మీదుగా వెళుతుందని భూమి రీసర్వే చేసి రైతు పొలా ల మీదుగా కాకుండా వాగు ద్వారా వెళ్లేలా చర్యలు చేపట్టాలని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గ్రామంలో రీసర్వే అవగాహన ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే యర్ నారాయణ, ఐఎస్‌వో వెంకటేశ్వరరావు, తహశీల్దార్ ఎం.శ్రీనివాస్,సర్పంచ్ డి.జ్యోతిరాణి, రైతులు పిన్నమనేని మధుమోహన్, అబ్బిన సురేంద్ర, గడా రామనరసింహారావు, కాట్రగడ్డ శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.