Share News

జై శ్రీరామ్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:23 AM

శ్రీరామనవమి వేడుకలను ఆదివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించి పానకం, వడపప్పు ప్రసాదాలు అం దజేశారు. ఆలయ ప్రాంగణాలను చలువ పం దిళ్లు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల్లో భారీ అన్నప్రసాద వితరణ చేశారు.

జై శ్రీరామ్‌
ధవళేశ్వరం బ్యారేజ్‌ కాలనీ రామాలయంలో కల్యాణోత్సవం

  • ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

  • రామాలయాల్లో ప్రత్యేక పూజలు

  • వైభవంగా సీతారాముల కల్యాణాలు

  • పానకం, వడపప్పు ప్రసాదం పంపిణీ

  • పలుచోట్ల అన్నసమారాధనలు

ధవళేశ్వరం/గోకవరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి వేడుకలను ఆదివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించి పానకం, వడపప్పు ప్రసాదాలు అం దజేశారు. ఆలయ ప్రాంగణాలను చలువ పం దిళ్లు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల్లో భారీ అన్నప్రసాద వితరణ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ కాలనీ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఉన్న కల్యాణ వేదికపై సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సాగి వెంకట సూర్యనారాయణ రాజు దంపతులు చేతులమీదుగా రుత్వికులు కల్యాణ మహోత్సవాన్ని చేయించారు. అనంతరం శ్రీరామహోమం జరిపించారు. అనంత రం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎర్రకొండ కోదండ రామాలయం కొత్తూరు వారి వీధి రామాలయం, గొల్లపేట రామాలయం, కోరి కాల్వ సెంటర్‌ రామాలయం, రధం వీధి గడియార స్తంభం వద్ద ఉన్న రామాలయం, యడ్ల వారి రామాలయం, జంగాల వీధి రామాలయం తదితర ఆలయాల వద్ద సీతారాముల కల్యాణా న్ని వైభవంగా నిర్వహించారు. ఎర్రకొండ వద్ద రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 3వేల మంది భక్తులకు మహాన్నదానం జరిపారు. కార్యక్రమంలో సావాడ శ్రీనివా సరెడ్డి, కనిశెట్టి అచ్చెంనాయుడు, వల్లిరెడ్డి సత్యనారాయణ, బి.రాం బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:24 AM