పోషకాహారానికి ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:42 AM
ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బెనడిక్ట్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం పాలచర్లలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

పాలచర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ బెనడిక్ట్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
దివాన్‌చెరువు ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజలు తాము తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలని పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బెనడిక్ట్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం పాలచర్లలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్న ట్టు చెప్పారు. చిన్నారులకు అవసరమైన పోషకాహారాన్ని వారికి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకూ అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వం అందజేస్తోందన్నారు. అలాగే ప్రజలకు అవసరమైన మందులను పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ భరత్ కేంద్రాలు ద్వారా ప్రభుత్వమే అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో పాలచర్ల పీహెచ్‌సీ సీహెచ్‌వో మేరీహెప్సీ తదితరులు పాల్గొన్నారు.