రుడాకు మాస్టర్ ప్లాన్!
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:31 AM
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ(రుడా) పరిధిలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మాస్టర్‌ప్లాన్ రూపొం దించనున్నామని రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి వెల్లడించారు.

1094 చ.కి.మీతో డ్రాఫ్ట్ రెడీ
మొత్తం 3,156 చ.కి.మీతో 27 మండలాలు, 392 గ్రామాలకు వర్తించే ప్రయత్నం
టూరిజం విజన్ డాక్యుమెంట్‌తో రుడా పరిధిలో టూరిజం అభివృద్ధి
1354 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు
పంచాయతీ సెక్రటరీలకు నోటీసులు
నెలాఖరులోపు లేఅవుట్లు రద్దు చేసుకుని, తిరిగి దరఖాస్తు చేయాలి
రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ(రుడా) పరిధిలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మాస్టర్‌ప్లాన్ రూపొం దించనున్నామని రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి వెల్లడించారు. రాజమహేం ద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడా రు. గతంలో రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల పరిధిలో 162 చ.కిలోమీటర్ల మేర మాస్టర్‌ప్లాన్ అమలులో ఉంది. కానీ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఉన్నప్పుడు 1094 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తయారుచేశారు. కానీ అప్పట్లో దానిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపలేదు. ఇవాళ దానిని మరింత మెరుగుప రచనున్నాం. దీనికోసం అభ్యంతరాలు తెలియ జేయవలసిందిగా ప్రజలను కోరుతున్నామని రమణచౌదరి చెప్పారు. అంతేకాక ప్రస్తుతం రుడా పరిధి బాగా పెరిగింది. తూర్పుగోదా వరి జిల్లాలోని అన్ని ప్రాంతాలతోపాటు, అం బేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం కూడా కలిసింది. దీంతో మొత్తం 3,156 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో మాస్టర్‌ప్లాన్ రూపొందించ వలసి ఉందన్నారు. ప్రస్తుతం 1094 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. దానికి మిగిలిన 2 వేల 61 చదరపు కిలోమీటర్లు కలిపి మాస్టర్‌ప్లాన్ కోసం ప్రయ త్నాలు మొదలు పెట్టాం. ఇదంతా పూర్తయితే మొత్తం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని స్పష్టంచేశారు. రుడా పరిధిలో ఏరియా డెవప్ మెంట్ ప్లాన్‌ను అమలు చేయనున్నాం. దాని కోసం కసరత్తు చేస్తున్నాం. ఏదో ప్లాన్ వేసి వదిలేయడం కాకుండా స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కనిపించేలా ఈ ప్లాన్ అమలు చేయనున్నాం. ఇండస్ర్టియల్ అభివృద్ధితోపాటు పర్యాటక రం గాన్ని ఉపాధి రంగంగా అభివృద్ధి చేయడానికి టూరిజం విజన్ డాక్యు మెంట్ ద్వారా రుడా పరి ధిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్న ట్టు చెప్పారు. ఎక్కువ మందికి ఉద్యోగ ఉపా ధికల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపడతాం. పీపీపీ విధానంలో రూపొందిస్తాం. రుడా పరి ధిలో అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఇప్ప టికే హేవలాక్, బ్రిడ్జిలంకకు నిధులు మంజూ రయ్యాయి. మరో 16 ఐలాండ్‌లు, లేక్‌లు కూడా గుర్తించామని చెప్పారు. పిచ్చుకలంక, ఆత్రేయపురం లంకలు, అఖండగోదావరి లంక లు, పోలవరం ప్రాజెక్టు దిగువన సీతానగరం, కోరుకొండ మండలాల పరిదిలోని కొండలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పురుషోత్తపట్నం ఆవను పర్యాట కంగా అభివృద్ధి చేయనున్నామన్నారు. వీటికి డీపీఆర్ తయారుచేయడానికి కన్సటెన్సీ ఎం పిక కోసం టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. రిసార్ట్స్, హోటళ్లు కూడా అభివృద్ధి చేస్తాం. రుడా ఆధ్వర్యంలో వాటిని ప్రమోట్ చేసి, ప్రై వేట్ భాగస్వామ్యంతో నిర్వహించనున్నట్టు వివరించారు. గతంలో రుడా నిధులతో నిర్మిం చిన రుడా పార్కులు, ఓపెన్ జిమ్‌లకు నిర్వ హణ లోపం ఉంది. కేవలం ఒక్కొక్కటి రూ. 25 లక్షల కంటే ఎక్కువ నిధులతో వీటిని నిర్మించినప్పటికీ నిర్వహణ లేదు. పీఈటీలు, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణకు ఇస్తే ఎలా ఉం టుందనే ఆలోచన చేస్తున్నామన్నారు. రుడా పరిధిలో 1800 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, బీపీఎస్ కింద 200 దరఖాస్తులు ఉన్నాయన్నారు. సిబ్బంది అధి కంగా అవసరం అవుతున్నారని, ఇప్పటికే మేళా నిర్వహించినా కూడా కొంతవరకూ మాత్రమే పరిష్కరించినట్టు చెప్పారు. ఒక భవనం కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలిం చాలన్నా, మొత్తం లేఅవుట్‌ను పరిశీలిస్తేనే గానీ, సమస్య తేలడం లేదని తెలియజేశారు.
మున్సిపాల్టీలు.. పంచాయతీల్లో రుడా షాపింగ్ కాంప్లెక్స్‌లు
మున్సిపాల్టీలు, పంచాయతీలు స్థలాలు చూపిస్తే రుడా నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే కొవ్వూరు, రామచంద్రపురం మున్సిపాల్టీల నుంచి, వెస్ట్ గోనగూడెం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని నిర్మించిన తర్వాత వచ్చే ఆదాయం ఆయా సంస్థలతోపాటు రుడాకు కూడా లభించేలా చేస్తున్నాం.
ల్యాండ్ ఫూలింగ్‌తో లేఅవుట్లు
ప్రజల నుంచి ల్యాండ్ ఫూలింగ్ చేసి రుడా లేఅవుట్లు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కేతన్‌గార్గ్, రుడా అధికార్లతో ఇప్పటికే చర్చించాం. దీనివల్ల అన్ని మౌలిక సదుపాయాలతో లేఅవుట్లు వస్తాయి. రుడా పరిధిలోని అనధికార లేఅవుట్‌లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. అక్కడ ఏవిధమైన నిర్మాణాలు చేపట్టకూడదని కూడా స్పష్టం చేశాం.