వాడపల్లి ఆదాయం రూ.4.28 లక్షలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:59 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

ఆత్రేయపురం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పలువురు భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,28,581 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. స్వామివారి అన్నప్రసాద భవన నిర్మాణానికి తణుకుకు చెందిన పురాణపండ వెంకటశివసాయిరామ్ రూ. 50,001 విరాళం ఇవ్వగా, దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసా దాలు అందచేశారు.