Kollu Ravindra: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:19 PM
Kollu Ravindra: గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం పాలసీపై తమ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందన్నారు. బెల్ట్ షాపులు అనేవి లేవని చెప్పారు. ఓ వేళ ఎవరైనా నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 11: మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు.. ఈ మధ్య కాలంలో మద్యం విషయంలో వైఎస్ జగన్ ఏమీ చేశాడో అందరు చూశారని ఆయన గుర్తు చేశారు. తాము మద్యం పాలసీపై పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మంగళవారం అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ధరలు పెంచడానికి అనేక రకాల మద్యాన్ని తీసుకు వచ్చారని చెప్పారు.
గతంలో పనికి మాలిన చెత్త మద్యాన్ని విక్రయించారని ఆయన విమర్శించారు. తాము మాత్రం రిటైలర్ మార్జిన్ 15 శాతం ఉండాలని భావించామన్నారు. తాము ప్రతి బాటిల్‌పై రూ. 10 మాత్రమే పెంచామన్నారు. గత మద్యం అక్రమాలపై విచారణ జరుగుతోందని.. అవన్నీ బయటికి వస్తాయని భయపడుతున్నారని చెప్పారు.
ఇక కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు కేటాయించామని వివరించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని.. అందులోభాగంగా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం150 కొత్త బ్రాండ్లు తెచ్చామన్నారు. ఏ మద్యం కావాలో వారే.. ఇండెంట్ పెట్టుకొంటారని వివరించారు.
గతంలో మద్యం సిండికేట్ చేసి విక్రయాలు జరిపింది వైఎస్ జగనేనని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. డిస్టలరీలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. బెల్ట్ షాపులనేవి లేవని చెప్పారు. ఓ వేళ బెల్ట్ షాపులు నిర్వహిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
గత ప్రభుత్వం మద్యం తాకట్టు పెట్టి రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చారని.. అందుకు సంబంధించిన ఇంకా రూ.13 వేల కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతి నెల అప్పులు ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
For AndhraPradesh News And Telugu News