గుదిబండలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:12 AM
హంగు ఆర్బాటాలకు పోయి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సొసైటీ గొడౌన్ల నిర్మాణాలు అక్కరకు రాకుండా పోయాయి. రైతుల అవసరాలకు తగ్గ ట్టుగా ధర లేని సమయంలో ఉత్పత్తులు నిల్వ చేసుకుని.. ఆ తర్వాత మార్కెట్ రేటు ఆశాజనకంగా ఉంటే పంటలను అమ్ముకునే వెసులుబాటుకు గొడౌన్‌లు ఉపయోగం పడాల్సి ఉంది

అక్కరకు రాని గొడౌన్లు
వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల అవస్థలు
పూర్తికాని నిర్మాణాలు
సొసైటీలకు అప్పులే మిగిలాయి
రైతులే లేని ఏలూరులో రెండు అవసరమా?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
హంగు ఆర్బాటాలకు పోయి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సొసైటీ గొడౌన్ల నిర్మాణాలు అక్కరకు రాకుండా పోయాయి. రైతుల అవసరాలకు తగ్గ ట్టుగా ధర లేని సమయంలో ఉత్పత్తులు నిల్వ చేసుకుని.. ఆ తర్వాత మార్కెట్ రేటు ఆశాజనకంగా ఉంటే పంటలను అమ్ముకునే వెసులుబాటుకు గొడౌన్‌లు ఉపయోగం పడాల్సి ఉంది. అయితే వైసీపీ పాలకులు అనాలోచిత నిర్ణయాలతో ఇష్టా రాజ్యంగా సొసైటీల పాలక వర్గాలను సంప్రదించ కుండా రైతుకు అందుబాటులో గొడౌన్ ఉందా? లేదా అనేది మరిచి వీటిని నిర్మించేశారు. తీరా ఆచ రణలో అవి రైతులు ఉపయోగం లేకుండా పోయా యి. అప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు సొసైటీలకు గుదిబండలుగా మారాయి.
2022 నుంచి 2024 మధ్య జిల్లాలో 500, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్లకు మార్కెటింగ్‌శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్య వేక్షణలో టెండర్లు పిలిచి 43 గొడౌన్ల నిర్మాణం చేప ట్టారు. ఇందులో కేవలం 22 పూర్తి అయ్యాయి. మరో 21 గొడౌన్లు వివిధ దశల్లో ఉన్నాయి. 500 మెట్రిక్ టన్నుల గొడౌన్‌కు రూ.40 లక్షలు, వెయ్యి మెట్రిక్ టన్నుల గొడౌన్ నిర్మాణానికి రూ.80 లక్షల చొప్పున ఆప్కాబ్ ద్వారా నాబార్డు రుణంతో వీటి నిర్మాణం చేపట్టారు. తీరా ఎక్కడా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఈ రుణం ఎలా తీర్చాలో సొసైటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మరోవైపు రైతులకు అందుబాటు లోకి ఈ గొడౌన్లు నిర్మించాల్సి ఉండగా, అప్పటి వైసీపీ స్థానిక నాయకుల జోక్యంతో రోడ్డుకు దూరంగా పంట ఉత్పత్తులు తరలిం చేందుకు అనువు గాని చోట్ల నిర్మించారు. పేరు కే ప్రాథమిక సహకార సంఘా లకు నిర్మాణ పర్య వేక్షణ బాధ్యతలు అప్పగించి స్థానిక వైసీపీ నాయకులే అంతా తామై వ్యవహరించి అసలు లక్ష్యానికి తూట్లు పొడిచారన్న ఆరోపణలున్నాయి.
రైతుల్లేని చోట్ల రెండు నిర్మాణం
ఏలూరు నగరంలో వ్యవసాయం చేసే రైతులు చాలా తక్కువ. చుట్టు పక్కల స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా రూపాంతరం చెందాయి. ఏదో కొద్ది మంది రైతులను ఆసరాగా చేసుకుని ఏలూరు టౌన్ విశాల పరపతి సహకార సంఘం పరిధిలో రెండు గొడౌన్‌లు నిర్మించేశారు. 2023–24 చివరలో వీటి నిర్మాణాలను వెంకటాపురం ఇందిరా కాలనీ, పోణంగి పంచాయతీ కార్యా లయం సమీపంలో ఒక్కొక్కటి రూ.40 లక్షల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. మాకు అవసరం లేదని చెప్పినా సొసైటీ పాలకవర్గం మాటల ను వినకుండా ఏకపక్షంగా మంజూరు చేసేశారు. ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ సొసైటీ రూ.80 లక్షల పైనే భారం మోయాల్సి వస్తోంది. నిర్మాణం పూర్తయిన చోట్ల గొడౌన్లను జిల్లా సహకార శాఖకు అప్పగించాల్సి ఉన్నా అదీ జరగలేదు. పాత నిర్మాణాలపై అధి కారులు మాకెందులే అన్న ధోరణిలో ఉన్నారు. అటు సహకారశాఖ అధికారులు.. ఇటు మార్కె టింగ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఎవ్వరికి వారే ఆగిన నిర్మాణాలపై దృష్టి సారించడం లేదు. వీటిపై డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిగా ఉన్న జేసీ ధాత్రిరెడ్డి దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
త్వరలో పూర్తి చేస్తాం
జిల్లాలో మొత్తం 43 గొడౌన్లకు గాను ఐదుచోట్ల స్థలాల వివాదాలు కోర్టుల్లో ఉండడంతో 38 నిర్మాణాలే ప్రారంభించాం. 33 గొడౌన్లు పూర్తయ్యాయి. అందులో కొన్నిచోట్ల పంట ఉత్పత్తుల కోసం ప్లాట్‌ఫారాలను నిర్మించాల్సి ఉంది. ఇటీవలే ఐదుచోట్ల నిర్మాణాలు నిలుపుదల చేశాం. త్వరలోనే ఆయా శాఖలకు ఈ గొడౌన్లు అప్పగిస్తాం. నిధుల విడుదల రాకపోవడంతో.. బిల్లులు కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవడం కొంత జాప్యం జరిగింది.
టి.మల్లేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ డీఈ
ఏలూరులోని మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, డీఈవో