Share News

CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే

ABN , Publish Date - Mar 05 , 2025 | 08:56 AM

CM Chandrababu:ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని, అక్కడే బస చేస్తారు. 6వ తేదీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

 CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే
CM Chandrababu

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(బుధవారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడ నగరం, పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారు. గన్నవరం నుంచి బయలుదేరి 1.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఓ శుభకార్యానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు రానున్నారు. 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.


అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. 5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొంటారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు. సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలుస్తారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. కాగా, రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ హాల్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..

రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 05 , 2025 | 11:26 AM