Share News

Vijayasai Reddy: జగన్‌పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి.. కౌంటర్లు మామూలుగా వేయడం లేదుగా..

ABN , Publish Date - Mar 15 , 2025 | 09:24 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పరోక్షంగా సెటైర్లు వేస్తూ జగన్‍పై విమర్శలు గుప్పించారు సాయిరెడ్డి.

Vijayasai Reddy: జగన్‌పై రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి.. కౌంటర్లు మామూలుగా వేయడం లేదుగా..
Former YSRCP MP Vijayasai Reddy

అమరావతి: వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వరసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పలు అంశాల విషయంలో జగన్‍ (Jagan Mohan Reddy)పై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి జగన్‌పై సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పరోక్షంగా సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.."పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుకి చుట్టూ కోటరీ ఉండేది.


ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే రాజు పాలన గురించి పొగడ్తలతో ముంచెత్తేది. ప్రతి దాన్నీ ఆహా రాజా.. ఓహో రాజా.. అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజూ పోయేవాడు, రాజ్యమూ పోయేది. కోటరీ కుట్రల్ని గమనించే తెలివైన రాజు అయితే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోటా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదేనంటూ" వ్యాఖ్యలు చేశారు.


కాగా, పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జగన్‌పై సాయిరెడ్డి దూకుడుగా మాట్లాడుతున్నారని వైసీపీకి చెందిన పలువురు నేతలే చర్చించుకుంటున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్ బై చెప్పానని మాజీ ఎంపీ ప్రకటించినప్పటికీ జగన్‌పై పరోక్షంగా స్వరం పెంచారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉన్నతస్థాయి పదవులు అనుభవించిన నేతలే బయటకు వెళ్లిపోతుంటే మన పరిస్థితి ఏంటని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు చర్చించుకుంటున్నారు. కాగా, ఇప్పటికే అనేక మంది నేతలు కూటమిలో చేరగా.. మిగతా వారూ ఏదో ఓ పార్టీ చూసుకోవడం బెటరని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Road Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన.. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Ramakrishna Case: టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. పుంగనూరు పోలీసులకు షాక్..

Updated Date - Mar 15 , 2025 | 09:40 PM