ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Satyakumar: జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 03 , 2025 | 03:53 PM

Minister Satyakumar: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.

Minister Satyakumar

గుంటూరు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. బీజేపీ నేత మాధవిలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు.


కూటమిలో ఉంటూ తమపై ఇలా మాట్లాడటం తగదని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై జేసీ ప్రబాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదని విమర్శించారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జేసీ ఆయన వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే

DK Aruna: సీఎం చంద్రబాబుపై డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 03 , 2025 | 03:57 PM